చిత్రం చెప్పే విశేషాలు!

(21-08-2022/1)

కోనసీమ జిల్లా పేరును ..డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చిన విషయం తెలిసిందే. పేరు మారి 18 రోజులవుతున్నా ప్రభుత్వం నిర్వహించే మీ-భూమి వెబ్‌సైట్‌లో మాత్రం జిల్లా పేరు కోనసీమగానే కొనసాగుతోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

Source: Eenadu

స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన గొట్టెటి నిర్మల సాయిశ్రీ, పెన్సిల్‌ ఆర్ట్‌తో స్వాతంత్ర్య సమరయోధులు, పోరాట ఘట్టాల చిత్రాలను వేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. 150 చిత్రాలతో ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌లో ఆమె ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Source: Eenadu

బేల నుంచి భవానీగూడ రహదారి దుస్థితి ఇది. కిలోమీటరు దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లే రహదారిలో అడుగుకో గుంత ఏర్పడింది. వర్షం కురిస్తే చాలు గుంత ఉన్న విషయం తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Source: Eenadu 

చిత్రంలోని విద్యార్థులు ఆటవిడుపు కోసం అలుగు వద్దకు వచ్చారనుకుంటున్నారు కదూ..! గండీడ్‌ మండలంలోని చెన్నయ్యపల్లి 1, చెన్నయ్యపల్లి 2, చెన్నయ్యపల్లి తండాలకు చెందిన విద్యార్థులు వేరే దారి లేక ప్రతి రోజూ ఈ మార్గంలోనే పాఠశాలకు వెళ్లాలి.

Source: Eenadu

కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహణ కొరవడింది. అథ్లెటిక్స్‌ ట్రాక్‌కు ఇరువైపులా గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. లాంగ్‌జంప్‌ పిట్‌, జావెలిన్‌, హ్యామర్‌ త్రో మైదానాల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

Source: Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం ఝరి పీహెచ్‌సీ సిబ్బంది శనివారం వాగు దాటి కాలినడకన గణేష్‌పూర్‌ గ్రామానికి చేరి ఆదివాసీలకు చికిత్సలు అందించారు.

Source: Eenadu

కారులో సరిపడా జనం నిండిపోయాక మిగిలిన వారు వెనక భాగం డిక్కీలో కూడా కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ద్యశ్యం పర్యాటక ప్రాంతం యారాడలో కనిపించింది. కొంతమంది సందర్శకులు బీచ్‌లో సరదాగా గడిపి ఇలా తిరుగుముఖం పట్టారు.

Source: Eenadu

కేజీహెచ్‌ తల్లీ పిల్లల వార్డులో బాలింతలకు బెడ్‌లు చాలకపోవడంతో వరండాలో కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఫ్యాను సౌకర్యం లేక ఉక్కబోత, దోమల మోతతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు సొంత టేబుల్‌ ఫ్యాన్లు వెంట తెచ్చుకుంటున్నారు.

Source: Eenadu

ఇటీవల ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కష్ణానది నిండుకుండలా కనిపిస్తోంది. వరద కొసాగుతుండటంతో కృష్ణానదిలో చేపల వేట నిషేధించారు. దీంతో మత్స్యకారులు తమ బోట్లను ఇలా ఒడ్డున వరుసగా నిలిపారు. ఈ ప్రాంతం సముద్ర తీరాన్ని తలపిస్తూ కనువిందు చేస్తోంది.

Source: Eenadu

ప్రకృతి అందాలకు నెలవైన నల్లమల అడవులు ఇటీవల కురిసిన వర్షాలకు హరిత శోభతో అలరారుతున్నాయి. కొత్తపల్లి మండలం కొలను భారతీదేవి క్షేత్రం సమీపంలో నల్లమల కొండలపై నుంచి దూకుతున్న జలపాతం ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home