చిత్రం చెప్పే విశేషాలు

(31-07-2022/1)

చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రచారం నిమిత్తం ఓ హోటల్‌ నిర్వాహకుడు ఇనియవన్‌ 44 కిలోల ‘తంబి’ ఇడ్లీని తయారు చేశారు. శనివారం సాయంత్రం బీచ్‌లో దీనిని ప్రదర్శించారు. తర్వాత మెరీనాలోని ‘నమ్మ సెల్ఫీ’ స్పాట్లో ఉంచారు. Source:Twitter

అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు నాగభూషణం మూడు ఎకరాల్లో టమాటా సాగు చేశారు. 1.50 క్వింటాళ్లను అనంతపురంలో విక్రయించేందుకు వెళ్లగా 15 కిలోల బాక్సు రూ.40లోపే పలకడంతో అక్కంపల్లి సమీపంలో రోడ్డు పక్కన పారబోశారు.

Source:Eenadu

రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్ల నిర్వహణ, పర్యవేక్షణ లేక ధ్వంసమైపోతున్నాయి. నీరుకొండ, నిడమర్రు గ్రామాలను కలిపే రోడ్డు భారీగా బీటలు వారి డ్రైనేజీ కాలువలోకి ఒరిగిపోతోంది. పట్టించుకునేవారే కరవయ్యారు.

Source:Eenadu

ఖర్కివ్‌ ప్రాంతంలో యుద్ధ కవరేజీకి వెళ్లి.. శుక్రవారం రష్యా దళాలు జరిపిన బాంబు దాడితో గోధుమ పొలంలో నుంచి పరుగు తీస్తున్న ఫొటో జర్నలిస్టు ఎవ్‌గెనియ్‌ మలొలెట్కా.

Source:Twitter

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంధన కొరత ఏర్పడటం, సొంత వాహనాల్లోనే వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడి ప్రజలు రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో శనివారం కొలంబోలోని ఓ రైల్వేస్టేషన్ ఇలా కిక్కిరిసిపోయింది.

Source:Twitter

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.

Source:Twitter

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించిన తాగునీటి పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఇత్తడి బిందె అదృశ్యమైంది. ఈ విషయమై కార్పొరేషన్‌ ఏఈ వాణిని సంప్రదించగా.. బిందె మాయమైన విషయమై విచారణ జరిపిస్తామన్నారు.

Source:Twitter

ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో శ్రావణమాసంలో వెదురు కర్రలపై నడుస్తూ చిన్నారులు సందడి చేస్తుంటారు. గోండు భాషలో ‘ఖోడంగ్‌’ గా పిలిచే వీటిపై నడవడం గూడేల్లో సంప్రదాయంగా వస్తోంది. ఇలా నడవడం వల్ల అంటు రోగాలు రావని గిరిజనుల నమ్మకం.

Source:Twitter 


స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home