చిత్రం చెప్పే విశేషాలు..!
(22-08-2022/2)
న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పరేడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహ పాల్గొన్నారు. అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరిస్తూ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.
Source: Eenadu
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం పరిసరాలు సందడిగా మారాయి. ఓ వ్యక్తి తన శరీరంపై జాతీయ జెండా, జాతీయ జెండా మోస్తున్న సీఎం కేసీఆర్ చిత్రాలు వేసుకొని ఇలా తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
Source: Eenadu
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.
Source: Eenadu
కొరియోగ్రాఫర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ హీరోగా మారి కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యథా రాజా తథా ప్రజా’ సినిమాలో ఆయన నటిస్తున్నారు.
Source: Eenadu
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని పోస్టు చేయగా.. మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Source: Eenadu
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా దర్శకుడు సుకుమార్ ‘పుష్ప ది రూల్’ పేరుతో రెండో భాగాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Source: Eenadu
నాగశౌర్య, యుక్తి థరేజా జంటగా ఓ కొత్త చిత్రం మొదలైంది. పవన్ బసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి సినిమా చిత్రీకరణను ప్రారంభించారు.
Source: Eenadu
ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు. ఎంపీ సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు ఆయన హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ, ఇతర ప్రముఖులతో కలిసి మొక్కలు నాటారు.
Source: Eenadu
హైదరాబాద్ మహానగరంలో మరో పై వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. చాంద్రాయణగుట్టలో రూ.45.90 కోట్లతో నిర్మించిన 674 మీటర్ల పొడవైన ఈ వంతెన రేపు ప్రారంభం కానుందని వెల్లడిస్తూ.. మంత్రి కేటీఆర్ ఈ చిత్రాన్ని ట్విటర్‌లో పోస్టు చేశారు.
Source: Eenadu