చిత్రం చెప్పే విశేషాలు..!

(23-08-2022/2)

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రం ‘లైగర్‌’. లైగర్‌ విశేషాలపై పూరీని.. పుష్ప దర్శకుడు సుకుమార్‌ ఇంటర్వూ చేశారు. పూర్తి ఇంటర్వూ రేపు విడుదల కాబోతోందని తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను పంచుకుంది.

Source: Eenadu

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి తన పుట్టినరోజు వేడుకను కామారెడ్డి జిల్లా దోమకొండ గడీకోటలో జరుపుకొన్నారు. ఆ చిత్రాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.

Source: Eenadu

చిట్యాల మండలం రాంచంద్రపూర్‌ శివారులోని ఓ చెట్టుకు పిచ్చుకలు గూళ్లు కట్టుకున్నాయి. ఎక్కువ మొత్తంలో ఉండటంతో ఆకట్టుకుంటున్నాయి. వాటిలో నుంచి పక్షులు తొంగిచూస్తూ.. చూపరులను కనువిందు చేస్తున్నాయి.

Source: Eenadu

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 130వ రోజుకు చేరింది. గద్వాల నియోజకవర్గంలో పత్తి చేలో పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. అక్కడే పాఠశాల దుస్తులు ధరించి పత్తి వెలికితీత పనులు చేస్తున్న చిన్నారులతో మాట్లాడారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఉన్న ఇనుప వ్యర్థాల బొమ్మలివీ. ఐదేళ్ల క్రితం కొందరు ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు ఆర్టీసీ బస్సుల విడి భాగాలతో వీటిని రూపొందించారు. ప్రస్తుతం అవి తుప్పుపట్టి పోతున్నాయి. వాటిని పట్టించుకోవాలని పలువురు కోరుతున్నారు.

Source: Eenadu

ఏపీ మంత్రి ఆర్కే రోజా శ్రీకాళహస్తి ముక్కంటిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. తొలుత ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఓ నూతన నగల దుకాణం ప్రారంభోత్సవానికి పలువురు మోడళ్లు హాజరయ్యారు. సంప్రదాయ చీరకట్టులో.. మెరిసే నగలు మెడలో వేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home