చిత్రం చెప్పే విశేషాలు..

(24-08-2022/1)

జగనన్న కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న హామీలు అమలుకావడం లేదు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని లేఅవుట్‌లో వేసిన తాత్కాలికంగా రోడ్లు అధ్వానంగా మారాయి. ఇంటి నిర్మాణ సామగ్రి తీసుకొస్తున్న ట్రాక్టర్లు రోడ్లపై గుంతల్లో కూరుకుపోతున్నాయి.

Source: Eenadu

ఏలూరు జిల్లా తెల్లంవారిగూడెం పాఠశాలలో విద్యార్థినులు ఒంటికాలిపై నిలబడి.. చేతులు జోడించి నిరసన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లోని రెసిడెంట్‌ ఏఎన్‌ఎంలను ప్రభుత్వం తొలగించి, గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Source: Eenadu

దత్తిరాజేరు మండలంలోని కన్నాం గ్రామానికి సమీపంలో కొండపై కనిపిస్తున్న ఈ చిత్రం చూసి పారాచూట్‌ అనుకుంటే పొరబడినట్లే. ఇది ఓ రాతి బండ. భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ అంచున చిన్న మొనపై నిలుచుంది. దీన్ని ‘వరద పసుపు రాయి’గా పిలుస్తామని స్థానికులు చెబుతున్నారు.

Source: Eenadu

భోగాపురంలోని జాతీయ రహదారిపై మంగళవారం సుమారు 90 చక్రాలున్న భారీ వాహనం కనిపించింది. దానిపై ఓ రైలు ఇంజిన్‌ను ఇలా తరలిస్తున్నారు. దీంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. బెంగళూరు నుంచి ఒడిశా వైపు ఈ వాహనం వెళుతోంది.

Source: Eenadu

ఇటీవల కురిసిన వర్షాలకు తారంతా చెదిరిపోయి.. గోతులు ఏర్పడ్డాయి. ఆ దారిలో సాగాలంటే సాహసం చేయాల్సిందే. మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గం(ఆలూరు)లోనే పరిస్థితి ఇలా ఉంది.

Source: Eenadu

చిత్తూరులో పలు ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించేందుకు సిబ్బంది తిరుపతి నుంచి చిత్తూరుకు అంబులెన్స్‌లో వచ్చారు. ఇతర ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో అంబులెన్సును ఉపయోగించారట.

Source: Eenadu

అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌ బయట ఉన్న వంతెన స్తంభాలపై దిమ్మెల ఎత్తు పెంచి బుద్ధుడు, ఏసుప్రభు, మహాత్మాగాంధీ విగ్రహాలు ఏర్పాటుచేశారు. వీధుల్లో కాకుండా ఇలా విగ్రహాలు ఏర్పాటు చేయడం వినూత్నంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు.

Source: Eenadu

అక్కడుండేదంతా రాళ్లు, రప్పల భూమే. అయితేనేం.. శక్తినగర్‌, మథురా తండా, డోన్‌గావ్‌ తదితర గ్రామాల్లోని రైతులు రాళ్ల భూముల్లో నల్లరేగడి భూముల పంటలకు దీటుగా పండిస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలన్నదే వారి చిరకాల కోరిక.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home