చిత్రం చెప్పే విశేషాలు..!

(02-08-2022/1)

దేశంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కానీ, ఆ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహం మాత్రం హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై కళతప్పి కనిపిస్తోంది. విగ్రహం దిమ్మె వెనక వైపునకు వంగిపోగా.. దానికి మరోవైపు మొక్కలు మొలిచాయి.

Source: Eenadu

పచ్చి కోడి మాంసాన్ని ఆరగిస్తున్న ఈ యువకుడి పేరు సంతోశ్‌కుమార్‌. ఒడిశాలోని జురియాపట్నా ఇతడి స్వగ్రామం. రాళ్లపై శిల్పాలు తీర్చిదిద్దుతూ ఉపాధి పొందే సంతోశ్‌ రోజుకు రెండు కోళ్లను వండకుండానే ఆరగిస్తాడు. బాల్యం నుంచి ఇలా తినడం అలవాటని చెప్పాడు.

Source: Eenadu

శ్రావణ మాసం పురస్కరించుకొని వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి జలాభిషేకం చేసేందుకు తరలివచ్చిన కన్వారీ భక్తులు.

Source: Eenadu

బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో అవిభక్త కవలలు బెర్నార్డ్, ఆర్థర్‌ లీమాలకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి వేరు చేశారు.

Source: Eenadu

అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విజయవాడ గాంధీ కొండపై గాంధీ స్తూపం వద్ద 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పులో జాతీయ జెండాను సచివాలయ ఉద్యోగులు ప్రదర్శించారు. స్తూపం చుట్టూ తిరుగుతూ, నృత్యాలు చేస్తూ కెమెరాలు, డ్రోన్‌లతో షూటింగ్‌ చేస్తున్నారు.

Source: Eenadu

రాజధానిలోని రాయపూడి గ్రామంలో చిన్నస్థలంలో మూడంతస్తుల భవనం నిర్మించిన చిత్రమిది. వెడల్పు తక్కువ.. పొడవు ఎక్కువ ఉన్న స్థలంలో అందంగా నిర్మించిన ఈ గృహం సీడ్‌యాక్సిస్‌ రహదారిలో వచ్చిపోయేవారిని కనువిందు చేస్తోంది.

Source: Eenadu

అక్కయ్యపాలెం నందగిరి నగర్‌ రోడ్డులో ఇటీవల భూగర్భ డ్రైనేజీ పైపులైను మరమ్మతుల నిమిత్తం తవ్వి సరిగా పూడ్చలేదు. సోమవారం ఇంటింటికి బియ్యం ఇచ్చేందుకు వస్తున్న వాహనం మట్టిలో కూరుకుపోయింది.

Source: Eenadu

యాదాద్రి పుణ్యక్షేత్రంలో తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా యాదర్శి అతిథిగృహం తుదిరూపు దిద్దుకుంటోంది. దీన్ని ఆలయ సందర్శనకు వచ్చే వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన వీఐపీల విడిది కోసం కేటాయించాలని యాడా యోచిస్తోంది.

Source: Eenadu

మై హార్ట్‌ ఈజ్‌ మిస్సింగ్‌

వైట్‌ ఎండ్‌ వైట్‌లో అలా..

చిత్రం చెప్పే విశేషాలు (19-05-2024/1)

Eenadu.net Home