చిత్రం చెప్పే విశేషాలు! (25/08/2022/1)

తిరుపతి జిల్లా రేణిగుంట- కరకంబాడి ప్రధాన మార్గాలను కలిపే శెట్టిపల్లె- మంగళం రోడ్డు ఇది. 1.5 కి.మీ. పొడవున్న ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Image:Eenadu

హరితహారం కొన్ని ప్రాంతాలలో తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. మొక్కలు వేల సంఖ్యలో నాటామని రికార్డులో చూపుతున్నది ఉత్తిదే అని ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. హరితహారం మొక్కల్ని నాటకుండా ట్రాక్టర్‌పై తీసుకొచ్చి వరంగల్‌ కోటలోని ఓ బావి వద్ద ఇలా చెత్తలో పడేస్తున్నారు.

Image:Eenadu

సుల్తానాబాద్‌ పట్టణంలోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంటి ఎదుట చక్రం పూల చెట్టు విరగబూసింది. చెట్టు నిండా తెల్లటి పూలు ఉండటం, మధ్యలో పచ్చటి ఆకులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Image:Eenadu

నేరెడుగొమ్ము మండల పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతాలైన కాచరాజుపల్లి, వైజాగ్‌కాలనీ, చిన్నమునిగల్‌, పెద్దమునిగల్‌, గువ్వలగుట్ట తదితర గ్రామాల చెంతకు కృష్ణా వెనుకజలాలు చేరాయి. మత్స్యకారులు, గిరిజనులు చేపల వేటను ముమ్మరంగా కొనసాగిస్తూ లాభార్జన పొందుతున్నారు.

Image:Eenadu

వంట గ్యాస్‌ ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం కన్వమిట్ట గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ తన తల్లితోపాటు, కొడుకు, కూతురుతో కలిసి సమీపంలోని కొండల్లో నుంచి కట్టెలు తీసుకొస్తూ కనిపించారు.

Image:Eenadu 

రాజమహేంద్రవరంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఇక్కడి హైటెక్‌ బస్టాండ్‌ ప్రాంతం వరదతో నిండిపోయింది. ఆ సమయంలో విశాఖపట్నం వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నీటిలో ఆగిపోయింది.

Image:Eenadu 

పంట పొలాల్లో విద్యుత్తు ప్రమాదాలు తరచూ జరుగుతున్నా.. సంబంధిత అధికారుల చర్యలు మాత్రం శూన్యం. అనంతపురం నుంచి కనగానపల్లికి కక్కలపల్లి మీదుగా వెళ్లే రహదారిలో పలుచోట్ల స్తంభాలు ఇలా ప్రమాదకరంగా ఒరిగి ఉన్నాయి.

Image:Eenadu

ప్రహరీ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఓ స్థల యజమాని వినూత్నంగా ఆలోచించారు. రహదారుల పక్కన లభించే తాటిచెట్లను నరికేసి... తన ఖాళీ స్థలానికి ఇలా రక్షణ కంచెలా ఏర్పాటు చేశారు. గాజువాక సమీప గంగవరం నుంచి యారాడ వెళ్లే మార్గమధ్యలో కనిపించిన దృశ్యమిది. Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home