చిత్రం చెప్పే విశేషాలు (03-08-2022/1) 


తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయం మంగళవారం జనసంద్రమైంది. నాగుల పంచమి సందర్భంగా నాగోబా దర్శనానికి 30 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తుల రావడంతో దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది. Source:Eenadu  

ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులన్నీ నిండా ప్రవహిస్తున్నాయి. దీంతో తీవ్రమైన ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకోలి వాగులోంచి ఇసుకను తీస్తున్నారిలా. జిల్లా వ్యాప్తంగా వాగుల వద్ద ఇసుక కోసం ఇదే పరిస్థితి నెలకొంది. 

Source:Eenadu  

ఇది.. విద్యార్థులు రూపొందించిన భారతం! 3,785 మంది పిల్లలు క్రమశిక్షణతో ఆవిష్కరించిన దేశ రూపం. అంత మంది విద్యార్థులు కాషాయం, ఆకుపచ్చ, తెలుపు వర్ణ దుస్తులు ధరించి దేశ ఐక్యతను ఇలా చాటారు. మకర్నూలు నగరం ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

Source:Eenadu  

సుందరీకరణతో పాటు విద్యుత్తును అందించడానికి గుంతకల్లు రైల్వే జంక్షన్‌ ముందు రూ.7 లక్షలతో సౌరవిద్యుత్తు చెట్టును కొత్తగా ఏర్పాటు చేశారు. రైలు బోగీ హోటల్‌ ఆవరణలోని పార్కులో అధికారులు దీన్ని నిర్మించారు. Source:Eenadu  

విశాఖపట్నం రైల్వే ఆసుపత్రి ప్రాంగణ సమీపంలో ఓ మంచినీటి ట్యాంకుకు రంగులు వేసి కళాత్మకంగా తయారు చేశారు. ట్యాంకు చుట్టూ వేసిన డాల్ఫిన్‌ బొమ్మలు దూర ప్రాంతాల వారికీ కనువిందు చేస్తున్నాయి.

Source:Eenadu  


శ్రావణమాసం సందర్భంగా విశాఖలోని తాటిచెట్లపాలెం ప్రాంతంలోని శ్రీపరదేశమ్మ ఆలయంలో మంగళవారం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్ష గాజులు, లక్ష పసుపు కొమ్ములతో సుందరంగా అలంకరించారు.

Source:Eenadu   

 విద్యతో పాటు వ్యవసాయ రంగంపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పుట్టపర్తి సంస్కృతీ కశాశాలల ప్రిన్సిపల్‌ బాలకోటేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి సమీపంలో వరి పంట సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Source:Eenadu  

విశాఖపట్నం నగర పరిధి 89వ వార్డు చంద్రనగర్‌లో మంగళవారం ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమ వేదికతోపాటు ఇతర చోట్ల ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనే ముద్రించడంతో... అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. Source:Eenadu  

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home