చిత్రం చెప్పే విశేషాలు! (25/08/2022/2)

కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన అనంతరం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి పలువురికి భోజనాన్ని పంపిణీ చేశారు.

Image:Eenadu


లండన్‌లోని ఓ జూలో పులి పొడవును కొలిచేందుకు స్కేలును ఏర్పాటు చేశారు. స్కేలుపై మాంసాన్ని ఆహారంగా వేయడంతో దాని కోసం పులి అక్కడ నిటారుగా నిల్చుంది. ఈ విధంగా జూ సిబ్బంది పులి శారీరక కొలతలను తీసుకున్నారు.

Image:Eenadu

హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఓ దేశీ కోళ్ల మాంసం విక్రయ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రిని కోడి, కిరీటంతో సత్కరించారు.

Image:Eenadu

మెక్సికో, హాంకాంగ్‌ నుంచి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్న జంతువులను అక్కడి అధికారులు పట్టుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన మాన్యుయేల్‌ పెరెజ్‌ 1700 వన్యప్రాణుల్ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు.

Image:Eenadu

హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఓ దేశీ కోళ్ల మాంసం విక్రయ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రిని కోడి, కిరీటంతో సత్కరించారు.

Image:Eenadu

వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండటంతో హైదరాబాద్‌లోని నాగోలులో కళాకారులు వినాయక విగ్రహాలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వర్షాలకు విగ్రహాలు తడవకుండా కవర్లను కట్టి.. కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్నారు.

Image:Eenadu

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం తమ్మి నాయనపల్లి నుంచి దేమకేతేపల్లి వరకు రోడ్డు పనులను తమ్మి నాయనపల్లి గ్రామ యువకులే స్వయంగా చేసుకుంటూ ఐకమత్యం చాటుతున్నారు.

Image:Eenadu


కృష్ణా జిల్లా పెడనలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నాలుగో విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొంత సమయం మగ్గంపై పని చేసి సందడి చేశారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home