చిత్రం చెప్పే విశేషాలు (03-08-2022/2) 

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వారసులు దిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారిని ఉపరాష్ట్రపతి నివాసానికి నివాసానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పింగళి వారసులను ఉప రాష్ట్రపతి శాలువాతో సత్కరించారు.

image: Twitter

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ.. తన మిత్రుడు, జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

image: Twitter 


మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. పరిహారం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

image: Twitter 

కర్ణాటకలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చిత్రదుర్గ జిల్లాలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యా పీఠాన్ని సందర్శించారు. అక్కడ శ్రీ శివమూర్తి మురుగ శరణారు చేతుల మీదుగా ‘ఇష్టలింగ దీక్ష’ను స్వీకరించారు.

image: Twitter 


సింహాలే కాదు.. నేనూ జూలు విదిల్చగలనని ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోన్నట్లు ఉంది కదూ! పేరు ఫెయింటింగ్ గోట్‌. ఇవి శీతల ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తాయి. ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి సాగర్‌ దీనిని పెంచుకుంటున్నారు.

image: Eenadu

తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఏలూరు కొమడవోలు సమీపంలోని తూర్పు లాకుల వద్ద రెండు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

image: Eenadu 


వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనర్‌ అవతారమెత్తిన సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో టీ20లో 76 పరుగులతో చెలరేగాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం స్టేడియంలో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానుల వద్దకు వెళ్లి ఆటో గ్రాఫ్‌లు ఇచ్చాడు.

image: Twitter

మై హార్ట్‌ ఈజ్‌ మిస్సింగ్‌

వైట్‌ ఎండ్‌ వైట్‌లో అలా..

చిత్రం చెప్పే విశేషాలు (19-05-2024/1)

Eenadu.net Home