చిత్రం చెప్పే విశేషాలు!
లంగర్‌హౌస్ బస్టాప్ వద్ద పరిస్థితి ఇది. పైవంతెన సమీపంలో రోడ్డుపై ఇలా నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్టాప్ నుంచి బస్సు ఎక్కే అవకాశం లేకపోవడంతో రోడ్డుపై నుంచే ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది.
Source: Eenadu
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై పోచారం వద్ద గతంలో నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. ఈ రహదారి మీదుగా వెళ్లేవారికి ఆహ్లాదం పంచుతున్నాయి.
Source: Eenadu
హైదరాబాద్ నగర శివారు కోహెడ సమీపంలో 15 రోజుల కిందట రాత్రి కొందరు రెండు వాహనాల్లో కోతులు తీసుకువచ్చి వదిలేశారు. అప్పటి నుంచి సమీపంలోని జామ తోటలను పాడుచేయడం, కోళ్ల ఫారాల లోపలికి చేరి దాణా తినడం చేస్తున్నాయి. పలువురిని గాయపరుస్తున్నాయి.
Source: Eenadu
ఇటీవలి వర్షాలకు జీడిమెట్ల నర్సాపూర్ రహదారి బస్ డిపో వద్ద రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించకపోవడంతో ఇలా నాచు పేరుకుపోయి పచ్చగా మారాయి. తొలగించకపోతే దోమలు పెరిగి చుట్టుపక్కల కాలనీ వాసులు అస్వస్థతపాలయ్యే ప్రమాదముంది.
Source: Eenadu
మీర్‌పేట వాటర్ ట్యాంక్ నుంచి అల్మాస్‌గూడా కమాన్ వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం రోడ్డు పక్కన భారీ వృక్షాలను అడ్డంగా నరికేశారు. రహదారి విస్తరణలో భాగంగా వీటిని తొలగించారు. సాంకేతిక పద్ధతిలో తరలిస్తే బాగుండేదని వృక్ష ప్రేమికులు అంటున్నారు.
Source: Eenadu
వినోదం ప్రతి ఇల్లూ చేరుతోంది. అందుకు అద్దం పట్టే చిత్రాన్నే మీరు చూస్తున్నది. వనస్థలిపురంలో రెండు పడక గదుల ఇళ్లలో ప్రతి కుటుంబం టీవీ డిష్ అమర్చుకున్న వైనమిది.
Source: Eenadu
మహారాష్ట్రలో చెరకును పరిశ్రమలకు తీసుకెళ్లడానికి రైతులు ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తారు. ఎడ్ల అవస్థను చూసిన ఆర్‌ఐటీ విద్యార్థులు ఎడ్లకు భారం తగ్గించేలా ‘థర్డ్ రోలింగ్ సపోర్టర్’ పరికరాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు ‘సారథి’ అని పేరు పెట్టారు.
Source: Eenadu
చిత్రం చూస్తుంటే ఈత కొడుతూ జలకాలాడుతున్నట్లు ఉంది కదూ..! కానీ వాగు దాటడానికి ప్రజలు పడుతున్న పాట్లు అవి. ఆదివారం కుమురం భీమ్ జిల్లా కెరమరి మండల కేంద్రంలో వారసంత కావడంతో అనార్‌పల్లి, గోర్యగూడ, లక్మాపూర్ వాసులు అతికష్టం మీద వాగు దాటి సరకులు కొనుక్కెళ్లారు.
Source: Eenadu
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలంలో కురిసిన భారీ వర్షాలకు సంతకు వచ్చిన చిరు వ్యాపారులు నానా ఇబ్బందులు పడ్డారు. పెద్దవాగులో నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురిని ఇలా ట్రాక్టర్ సాయంతో ఇలా వాగు దాటించారు.
Source: Eenadu