చిత్రం చెప్పే విశేషాలు!

(04-08-2022/1)

వైఎస్‌ఆర్‌ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోట త్రివర్ణ పతాక దీపకాంతులతో కళకళలాడుతోంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా గండికోటలోని మాధవరాయస్వామి దేవాలయం ముఖద్వారానికి జాతీయ పతాక రంగు దీపాలతో అలంకరించారు.

Source: Eenadu

ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు పండ్లు, పూలు, కూరగాయలు కనిపిస్తున్నాయేమిటి అనుకుంటున్నారా? బుధవారం జగనన్నతోడు ప్రారంభం సందర్భంగా చిరు వ్యాపారులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటోందనే విషయాన్ని తెలిపేలా ఏర్పాటు చేశారు.

Source: Eenadu

సంగం బ్యారేజీ వద్ద విద్యుత్తు దీప స్తంభాలు ఏర్పాటు చేశారు. 1195 మీటర్ల పొడవైన బ్యారేజీలో 85 గేట్ల వద్ద రెండు ఎల్‌ఈడీ దీపాల చొప్పున 170 బిగించారు. దీంతో బ్యారేజీ పై వంతెన భాగం, బ్యారేజీలో గేట్ల వైపు ప్రాంతాలు ప్రకాశవంతమవుతాయి.

Source: Eenadu

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ బాగా వస్తుందని ఓ వ్యక్తి.. ఇలా డబ్బాకొట్టుపై వీడియో గేమ్స్‌లో నిమగ్నమయ్యారు. చెట్ల కింద హాయిగా ఉంటుందని.. డబ్బాకొట్టు లోపల కొందరు ఎంచక్కా ఆడుకుంటున్నారు. ఇందుకూరుపేట మండలం లేబూరులో కనిపించిందీ దృశ్యం.

Source: Eenadu

వంగర మండలంలోని సీతారామ సొసైటీకి చెందిన మత్స్యకారులు వీరు. మడ్డువలస జలాశయం వంగర సమీపంలో పిట్టతామరతో నిండిపోవడంతో వేటకు ఆటంకం ఏర్పడుతోంది. రూ.వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వలలు చిక్కుకుపోవడంతో నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Source: Eenadu

దిల్లీలో బుధవారం నిర్వహించిన తిరంగా బైక్‌ ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

Source: Eenadu

మణుగూరులోని పీవీ కాలనీ అడ్డరోడ్డు వద్ద బుధవారం మణుగూరు పోలీసులు వాహన పత్రాలను తనిఖీ చేశారు. గమనించిన చోదకులు పలువురు తమ వద్ద వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో తోగ్గూడెం వరకు ఇలా వాహనాలను నిలిపి వేచి ఉన్నారు. తనిఖీ ముగిశాక వెళ్లారు.

Source: Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్న నీటి సంగమం చూశారా..! ఒకటి ఎరుపు, మరోటి నీలిరంగులో ఉన్న నీటిపాయలు ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇలా కలిశాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జూలూరుపాడు- జడలచింత మధ్య పొలాల్లో ఈ దృశ్యం ఆవిషృతమైంది.

Source: Eenadu

వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి అంపల్లి ప్రాథమిక పాఠశాల తరగతి గదుల్లోకి నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వరద రావడంతో ఇంటికి వెళ్లలేక, పాఠశాలలో కూర్చోలేక గంటల తరబడి వరండాలో నిలిచే ఉండాల్సి వచ్చింది.

Source: Eenadu

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home