చిత్రం చెప్పే విశేషాలు (04-08-2022/2)

పార్లమెంటులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సహచర ఎంపీలతో ముచ్చటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. source: Eenadu

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరింది. భువనగిరి నియోజకవర్గంలోని గొల్లగూడెం, చిన్నరావులపల్లి, గుర్రాలదండి మీదుగా బట్టుగూడెం వరకు నేటి యాత్ర సాగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

source: Eenadu

వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిర్వహించిన గ్రేటర్‌ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ సైకిల్‌పై వచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేళ ఆయన సైకిల్‌కు జాతీయజెండా కట్టుకొని రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

source: Eenadu

ఒంగోలులో విద్యార్థులు ‘హర్‌ ఘర్‌ తిరంగా’పై అవగాహన కల్పిస్తూ భారీ జాతీయ జెండాతో ఇలా ప్రదర్శన ఇచ్చారు.

source: Eenadu

హైదరాబాద్‌ నగర శివారు హయత్‌ నగర్‌లోని ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు గిజిగాడు పక్షులు గూళ్లు కట్టుకుంటున్నాయి. పక్కనే ఉన్న పొలాల్లో గడ్డిపరకలను ముక్కుతో పట్టుకొచ్చి పద్ధతిగా గూళ్లు తీర్చిదిద్దుకుంటున్నాయి.

source: Eenadu

హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల కోసం ఓ వ్యక్తి ఇలా నీటిలోకి దిగి వెతుకుతూ కనిపించాడు. పొట్టకూటికి పుట్టెడు తిప్పలు అంటే ఇదే మరి.

source: Eenadu

జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కార్ట్‌వీల్‌ గెలాక్సీకి చెందిన అద్భుతమైన ఫొటోలను విడుదల చేసింది. 500 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

source:Twitter

ఏడెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌లో నిర్మితమైన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు.

source: Eenadu

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home