చిత్రం చెప్పే విశేషాలు....!

నిజామాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాసర ఐఐఐటీ విద్యార్థులను ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ బల్మూరి పరామర్శించారు. ఆసుపత్రి వైద్య బృందంతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Source: Eenadu

కత్తి కార్తీక కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతేడాది జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో కార్తీక ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Source: Eenadu

ఇటీవల భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సరైన ఫామ్‌లో లేకపోవడంతో ఆయన అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. దీనికి దృష్టి కోణం(పర్‌స్పెక్టీవ్) అనే పదాన్ని జత చేస్తూ విరాట్‌ పోస్టు పెట్టారు.

Source: Eenadu

భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉద్ధృతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. భారీవర్షాలకు గోదావరికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఈ సందర్భంగా నదీమతల్లికి ఆయన ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు.

Source: Eenadu

ఏలూరు జిల్లాలోని కుక్కునూరులో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దీంతో ఇళ్లు, వాహనాలు, దారులు జలదిగ్బంధమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Source: Eenadu

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీలోని జలౌన్‌ జిల్లాలో బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎంలు బ్రజేశ్‌ పతక్‌, కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తదితరులు పాల్గొన్నారు.

Source: Eenadu

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా కౌలు రైతు పచ్చిమళ్ల శంకరం కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.

Source: Eenadu

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ కన్వెన్షన్‌లో జేడీ ఫ్యాషన్‌ కళాశాల విద్యార్థులు డిజైన్‌ చేసిన దుస్తులతో మోడల్స్‌ ర్యాంప్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. వివిధ రకాల వ్యర్థాలతో విద్యార్థులు చూడముచ్చటైన వస్త్రాలను డిజైన్‌ చేసి అదరహో అనిపించారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home