చిత్రం చెప్పే విశేషాలు! (22-07-2022) 

జ్రాయెల్‌లోని నెటన్యా పట్టణ సమీపంలో మక్కాబియా గేమ్స్‌ నిర్వహించారు. అందులో భాగంగా మోటోక్రాస్‌ ఈవెంట్లో పాల్గొన్న రైడర్లు తమ విన్యాసాలతో ఇలా అబ్బురపరిచారు.

#Twitter

శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స పరారీతో ఆయన అధికారిక నివాసంలోకి చొరబడి గత కొన్ని రోజులుగా తిష్ట వేసిన నిరసన కారుల్ని సైనికులు ఎట్టకేలకు బయటకు పంపించారు.దీంతో అధ్యక్షుడి నివాసం ఎదుట నిరసన కారులు ఇలా కూర్చుండిపోయారు.

 #Twitter

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ వరద ముంపు కారణంగా నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

#Eenadu

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌ను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను మంత్రి పంపిణీ చేశారు.

#Eenadu


వరద ముంపు ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో వరద ముంపు బాధితులను ఆయన పరామర్శించి.. భరోసా కల్పించారు. వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. #Eenadu

ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగమయ్యారు. ఇటీవల గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈయనకు ఛాలెంజ్‌ విసిరారు. సవాల్‌ను స్వీకరించిన వందే మాతరం శ్రీనివాస్‌ ఇవాళ మొక్కలు నాటారు.

#Twitter

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్​రౌండ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో నీరజ్‌ ఎంత దూరం వరకు జావెలిన్‌ను విసురుతాడనేది ఆసక్తికరంగా మారింది.

#Twitter

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home