చిత్రం చెప్పే విశేషాలు! (07-08-2022/2)
తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్ ఫ్లై) విభాగంలో నార్తన్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది.
Image:Twitter
ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందిన జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్‌ఖడ్‌కు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
Image:Twitter
కామన్వెల్త్ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో పెనాల్టీ షుటవుట్‌లో 2-1 తేడాతో భారత మహిళలు విజయం సాధించారు.
Image:Twitter
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ విభాగంలో శనివారం నిర్వహించిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల టీమ్ ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా క్రీడాకారిణులు విన్నింగ్ సెల్ఫీ తీసుకొని సంబరాన్ని పంచుకున్నారు. Image:Twitter
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కార్మికుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.
Image:Twitter
కర్నూలు జిల్లాలోని ఆదోని కూరగాయల మార్కెట్‌లోకి తెల్లగా నిగనిగలాడే వంకాయలు అమ్మకానికి వస్తున్నాయి. నిజానికి వంకాయలు ఆకుపచ్చ, ఊదా రంగులో ఉంటాయి. ఇవి మాత్రం తెలుపు రంగులో అందరినీ ఆకర్షిస్తున్నాయి.
Image:Eenadu
దిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన ఏపీ సీఎం జగన్‌ను పలకరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
Image:Twitter
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. Image:Eenadu
సైబరాబాద్‌లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సేవలు ప్రారంభమయ్యాయి. సీపీ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ఆరు బైక్‌లను ప్రారంభించారు. సైబరాబాద్ పరిధిలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. Image:Twitter