చిత్రం చెప్పే విశేషాలు...!

ఇటీవల కురిసిన వర్షాలతో గండిపేట చెరువు పరిసరాలు పచ్చదనంతో నిండిపోయాయి. ఇటీవల జలాశయం గేట్లు ఎత్తడంతో దిగువకు పారుతున్న నీరు సెలయేరును తలపిస్తోంది.

Source: Eenadu

అప్పుడే పుట్టిన దూడ.. తనివితీరా చూసుకుందో లేదో.. అంతలోనే యజమాని దూడను ట్రాలీ ఆటోలో వేసుకొని ఇంటికి బయల్దేరాడు.. వెంటనే ఆవు ఆటో వెంట పరుగులు తీసింది.. గోదావరిఖనిలోని జీఎం కాలనీ సమీపంలో ఈ దృశ్యం కనిపించింది.

Source: Eenadu

మంగపేట, కమలాపురంలో ఇటీవల గోదావరి వరదలో సుమారు వంద మందిని జాలరి మాటూరి కిష్టయ్య తన నాటు పడవలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయాన్ని ఎస్సై తాహెర్‌బాబా మంత్రికి వివరించారు.

Source: Eenadu

ఈ చిత్రాన్ని చూస్తుంటే సీతాకోక చిలుకకు తోక ఉన్నట్లు కనిపిస్తుంది కదూ. మంగపేట టీచర్స్‌కాలనీలోని ఓ ఇంటి వద్ద మందార పువ్వుపై సీతాకోక చిలుక ఇలా రెక్కలు విప్పి మకరందాన్ని ఆస్వాదిస్తోంది. మధ్యలో నుంచి మందార పువ్వు కాడ సీతాకోక చిలుకకు తోకలాగా కనిపిస్తోంది.

Source: Eenadu

ఏటూరునాగారం మండలంలో శనివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క జంపన్నవాగుపై పడవలో వెళ్తుండగా మధ్యలో ఆగిపోయింది. క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

Source: Eenadu

నాలుగు రోజుల కిందట కురిసిన వర్షాలకు చిన్న చిన్న కుంటలన్నీ నిండాయి. కోయిలకొండ మండలం గార్లపాడు బీట్‌ పరిధి అటవీప్రాంతంలో భవానీసాగర్‌ నిండి అలుగు పారుతోంది. ప్రకృతి ఒడిలో కనువిందు చేస్తున్న మనోహర దృశ్యమిది.

Source: Eenadu

యువత తమ ప్రత్యేకతను చాటుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కరీంనగర్‌ దిగువ మానేరు జలాశయం కట్టపై స్పీడ్‌బైక్‌తో యువత విన్యాసం చేశారు. ఒకదశలో పట్టుతప్పి కిందపడిపోయారు.

Source: Eenadu

ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాకాల సరస్సు నాలుగు అంగుళాల ఎత్తుతో మత్తడి పడుతుండటంతో పర్యాటకుల సందడి పెరిగింది. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో పిల్లా పాపలతో వస్తున్నారు. మత్తడి వద్ద ప్రమాదాలు జరగకుండా అటవీ శాఖ, పోలీసులు తగు చర్యలు చేపట్టారు.

Source: Eenadu

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కరకట్ట కోతకు గురైంది. గోదావరి వరద మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంతోపాటు పరిసర గ్రామాలను ముంచెత్తింది. వరద తగ్గడంతో బెగ్లూర్‌ శివారు.. హనుమాన్‌ ఆలయ ప్రాంతంలో కరకట్ట కోతకు గురై బండరాళ్లు కొట్టుకుపోయినట్లు శనివారం గుర్తించారు.

Source: Eenadu

ఖాజాగూడలో సినీనటి సురభి పురాణిక్‌ సందడి చేశారు. స్థానికంగా ఓ డిజైనర్, ఫ్యాషన్‌ స్టూడియోను శనివారం ప్రారంభించారు. అందులోని దుస్తులు, నగలను ధరించి హోయలు పోయారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home