చిత్రం చెప్పే విశేషాలు!
(18-07-2022/2)
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దిల్లీలో ఓటు వేసిన ప్రధాని మోదీ
Source: Eenadu
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధును ‘సింగపూర్ తెలుగు సమాజం’ ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సత్కరించింది. సింధుతో పాటు ఆమె తండ్రి వెంకట రమణను ఆ సంఘం ప్రతినిధులు సన్మానించారు.
Source: Eenadu
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన 56 అడుగుల పొడవు క్రికెట్ బ్యాట్‌పై కొందరు పిచ్చి రాతలు రాయడంతో కళావిహీనంగా మారుతోంది.
Source: Eenadu
తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
Source: Eenadu
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాజరైన తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇద్దరు మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్‌ల మధ్య కూర్చొని ముచ్చటించారు.
Source: Eenadu
మలేసియా కస్టమ్స్ అధికారులు ఆఫ్రికన్ ఏనుగు దంతాలు, ఇతర జంతువుల ఎముకలు, పుర్రెలను తరలిస్తున్న కంటైనర్‌ను సీజ్ చేశారు. ఇందులో పట్టుబడిన వాటి విలువ సుమారు 18మిలియన్ డాలర్లు ఉంటుందని వారు తెలిపారు.
Source: Eenadu
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ నేడు నామినేషన్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంట రాగా.. ధన్‌ఖడ్ తన నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu