చిత్రం చెప్పే విశేషాలు..!
(21-07-22/1)
నిత్యావసరాలపై జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్‌ను పైకెత్తి చూపుతున్న రాజ్యసభ ఎంపీ పులోదేవి నెతాం.
Source: Eenadu
ఎంతో పవిత్రమైన దుర్గగుడి కొండపై అధికారులు మరో నడకదారి కోసం కోట్లు ఖర్చుచేసి సగంలోనే వదిలేశారు. అక్కడ ఉన్న గుహ అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. కొండ పవిత్రతను కూడా కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
Source: Eenadu
కాలం గడుస్తున్న కొద్దీ భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల స్వరూపం మారిపోతూ ఉంది. ఐదేళ్ల క్రితం వచ్చిన సందర్శకులు ప్రస్తుతం వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు. చాలా దిబ్బలు కరిగిపోయి ఉండటం...కొన్ని చోట్ల తవ్వేసిన తీరు విస్తుపోయేలా చేస్తుంది.
Source: Eenadu
బోసినవ్వుల బుజ్జాయి సహా ద్విచక్ర వాహనంపై నలుగురి ప్రయాణం. అది చాలదన్నట్టు బండి నడుపుతూ చరవాణిలో మాటామంతి. రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు నుంచి సెంట్రల్ జైలుకు వెళ్లే మార్గంలో బుధవారం కనిపించిన చిత్రమిది.
Source: Eenadu
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో బోడ కాకరకాయలు తినడం వల్ల లాభాలు అనేకం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇప్పుడిప్పుడే ఇవి మార్కెట్‌కు వస్తున్నాయి. కరీంనగర్ మార్కెట్లో బుధవారం వీటి ధర కిలో రూ.400 పలికింది. ధర ఎక్కువే..అయినా కొనుగోలుదారులు కొందరు ఆసక్తి చూపారు.
Source: Eenadu
చిత్తూరు - జీడీనెల్లూరు మార్గంలో నగర శివారులో ఉన్న ఠాణా చెక్‌పోస్టు సమీపంలో కొండలను లోతుగా తవ్వారు. తవ్వకాల్లో వృథాగా ఉన్న రాళ్లను ఇలా జారవిడుస్తున్నారు. ఆ రాళ్లన్నీ రహదారిపైకి జారుతూ భయాందోళన కలిగిస్తున్నాయి.
Source: Eenadu
కుప్పం మండలంలోని రాళ్లచేను మీదుగా నూరాలగుండ్లచేను గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డుపై పెద్ద బండరాయి పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.
Source: Eenadu
గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప గ్రామంలోని ఈ ఇంటిని చూశారా? 1950ల్లో ఇక్కడ బీటీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజినీర్ల కోసం గుహల మాదిరిగా ఇళ్లు నిర్మించారు. ఆ తర్వాత అవి ఖాళీగా ఉండటంతో రూ. వందలోపే అద్దెకిస్తున్నారు. ఈ తరహా ఇళ్లు దాదాపు 56 వరకు ఉన్నాయి.
Source: Eenadu