చిత్రం చెప్పే విశేషాలు! (27/08/2022/1)

వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండల కేంద్రంలో ఉన్న ఖిల్లా దుర్గం కొండను తాకుతూ మేఘాలు వెళ్తుండటం చూపరులను ఆకట్టుకుంది. శుక్రవారం ఉదయం తెలవారుతుండగా ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ కెమోరాలో బంధించింది.

Image:Eenadu

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఆటోలలో కిక్కిరిసి వేలాడుతూ ఆపసోపాలు పడుతున్నారు.

Image:Eenadu

నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఎండబెట్ల గ్రామంలో మోహన్‌ కులకర్ణి సరస్వతి దంపతులు ఆవుదూడకు బారసాల (తొట్టెల) నిర్వహించి వంద మందికిపైగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆవు ప్రాధాన్యం తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మోహన్‌ కులకర్ణి తెలిపారు.

Image:Eenadu

కేపీహెచ్‌బీ మూడోరోడ్డులోని శివాలయం ప్రాంగణంలోని కామాక్షీ అమ్మవారికి చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా 4 వేల నిమ్మకాయలతో అలంకరించారు. పచ్చదనంతో అమ్మవారి విగ్రహం కళకళలాడింది.

Image:Eenadu

నెల్లూరులోని జాతీయ రహదారి పక్కన కాకుటూరు సమీపంలోని ఇంటి వద్ద దుకాణం కోసం వేసిన రేకుల షెడ్డు మొత్తంగా మొక్క అల్లుకుంది. పచ్చదనం పరుచుకోవడంతో పచ్చని పందిరిగా మారి చూపరులను ఆకర్షిస్తోంది.

Image:Eenadu

జమ్మూకశ్మీర్‌లో భారత సైనికులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలివి. శుక్రవారం వీటిని ఇలా ప్రదర్శించారు. ఈ ఆపరేషన్‌ సందర్భంగా ముగ్గురు ముష్కరులను సైనికులు హతమార్చారు.

Image:Eenadu

భారీ వర్షాల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా, యమునా నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో సమీపంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి.

Image:Eenadu

అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిపై శుక్రవారం వెలుగులీనుతున్న అటల్‌ వంతెన. ప్రధాని మోదీ దీన్ని శనివారం ప్రారంభించనున్నారు.

Image:Eenadu

మదర్‌ థెరిసా జయంతిని పురస్కరించుకొని శుక్రవారం సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌లో ఉన్న ఆమె విగ్రహం ముందు స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలు జల్లుతూ ఘనంగా నివాళులర్పించారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home