చిత్రం చెప్పే విశేషాలు! (27/08/2022/2)

తూర్పు జెరూసలేంలోని సిల్వన్‌లో ఇళ్లపై స్థానిక, అంతర్జాతీయ ప్రముఖుల కళ్ల చిత్రాలను తీర్చిదిద్దారు. ఈ చిత్రాల కారణంగా ఇక్కడి ఖాళీ వీధుల్లో నడుస్తున్నా ఎవరో చూస్తున్నారన్న అనుభూతి కలుగుతుంది.

Image:Eenadu

వినాయక చవితిని పురస్కరించుకొని సికింద్రాబాద్ గణేశ్‌ దేవాలయంలో భక్తులకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ మట్టి గణపతులను అందజేశారు. Image:Eenadu

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. జాన్సన్‌ అనే వ్యక్తి తీసిన ఆసక్తికర ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో బోటు కింద భారీ పరిమాణంలో ఉన్న బ్లూ వేల్‌ ప్రయాణిస్తూ కనిపించింది.

Image:Eenadu 

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో మాజీ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌తో భేటీ అయ్యారు. టీమిండియాకు కెప్టెన్‌గా మిథాలీ అందించిన సేవలను గుర్తు చేస్తూ నడ్డా అభినందించారు.

Image:Eenadu

వినాయక చవితి పర్వదినం కోసం విశాఖలో కళాకారులు భిన్న రూపాల్లో గణనాథుల విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు.

Image:Eenadu

ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కొత్తపల్లి రమేశ్‌ ఆచారి అనే కళాకారుడు సూక్ష్మ కళతో తన అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 150మిల్లీ గ్రాముల బంగారు రేకుపై ఒక సెంటీమీటర్‌ ఎత్తు, 2 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈటీవీ లోగోను తయారు చేశారు.

Image:Eenadu 

తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి శ్రీవారి దర్శనం కల్పించారు.

Image:Eenadu 

 బెల్జియంలోని ఫార్ములా వన్‌ పోటీలు నిర్వహించే రేస్‌ ట్రాక్‌ వద్ద ఫ్రెంచ్‌ పైలట్‌ ఫ్రాంకీ జపట తన ఫ్లైబోర్డుతో గాల్లో ప్రయాణిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెల్జియన్‌ ఫార్ములా వన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ ఆదివారం ప్రారంభం కానుంది.

Image:Eenadu

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ కోసం భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Image:Eenadu

 తితిదే దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాన్ని శ‌నివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా నిర్వహించారు. Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home