చిత్రం చెప్పే విశేషాలు! (30/08/2022/1)
విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు సిబ్బంది నుంచి సహకారం అందడంలేదు. డాక్టర్లు రాసే వివిధ రకాల పరీక్షలకు చక్రాల కుర్చీలో కుటుంబీకులే తోసుకుంటూ వెళుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Image:Eenadu
మంత్రాలయానికి చెందిన సూక్ష్మకళాకారిణి నళిని మనసాని పెన్సిల్ ముక్కపై వినాయకుడిని చెక్కింది. వినాయక చవితి సందర్భంగా 13 ఎం.ఎం ఎత్తు, 4 ఎం.ఎం వెడల్పుతో పెన్సిల్‌ముక్కపై వినాయకుడి బొమ్మను చెక్కింది.
Image:Eenadu
శ్రీ సత్యసాయి జిల్లాలో పేరుగాంచిన అగళి చెరువు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సువర్ణముఖి నది జలాలు ఈ చెరువులోకి పెద్దఎత్తున చేరుతున్నాయి. 32 ఏళ్ల తరువాత సోమవారం తెల్లవారు జాము నుంచి చెరువు మరువ పారుతోంది.
Image:Eenadu
రద్దీ వేళ అమీర్‌పేట మెట్రో స్టేషన్ కిటకిటలాడుతుంటుంది. ఇది ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ కావడం అందుకు ప్రధాన కారణం.ఈ పరిస్థితుల్లో అక్కరకు రావాల్సిన టికెట్ వెండింగ్ యంత్రాలు మొరాయించడం విమర్శలకు తావిస్తోంది.
Image:Eenadu
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో స్నేక్ బర్డ్‌లు అధికంగా తిరుగుతుంటాయి. తమ జాతిని పెంపొందించుకునేందుకు మాత్రం జన్నారం రేంజ్ పరిధిలోని బైస్‌కుంటలోని ఎండు చెట్ల మీద మాత్రమే గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి.
Image:Eenadu
ఈ సారి హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఇందిరాపార్క్ వద్ద ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టె ఇది.
Image:Eenadu
దళితబంధు పథకం కింద ఖమ్మం జిల్లా మధిర మండలం రొంపిమళ్ల గ్రామానికి చెందిన కారెమంచి పుల్లారావుకు రూ.3 లక్షల విలువైన డ్రోన్ అందింది. దానితో సమీప గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఎరువులు, పురుగు, గడ్డి మందులు పిచికారి చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
Image:Eenadu
దిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిసిన నెదర్లాండ్స్ రాణి మాక్సిమా
Image:Eenadu