చిత్రం చెప్పే విశేషాలు..!
(30-08-2022/2)
నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో అడుగుపెట్టి నేటికి 48 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం సెట్స్ నుంచి #NBK107 అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ స్పెషల్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
Source: Eenadu
తైవాన్‌లోని తైపీ జూలో టుయాన్ టుయాన్, యుయాన్ యుయాన్ అనే రెండు పాండాలకు 18వ పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. వాటికి జూ సిబ్బంది కేకు ఇవ్వగా.. అవి రెండూ కలిసి ఇష్టంగా ఆరగించాయి. 2008లో ఈ పాండాలను చైనా తైవాన్‌కు అప్పగించింది.
Source: Eenadu
వినాయక చవితి సందర్భంగా చాలా మంది భక్తులు పర్యావరణ హితం కోరి మట్టి గణపతిని పూజించడానికే ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్‌లోని ఓ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న మట్టి గణేశుడి విగ్రహాలు ఇవి.
Source: Eenadu
ఆసియా కప్‌లో భాగంగా పాక్‌పై విజయం సాధించడంతో టీమ్ ఇండియా పుల్ జోష్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35 పరుగులు చేశాడు. హాంకాంగ్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు విరాట్ సిద్ధమవుతున్నాడు. అందుకోసం జిమ్‌లో ఇలా కసరత్తులు చేస్తున్నాడు.
Source: Eenadu
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించారు.
Source: Eenadu
ఆధార్, ఓటర్ కార్డుల అనుసంధానంతో ఎన్నికల వ్యవస్థలో సత్ఫలితాలు వస్తాయని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన స్వచ్ఛందంగా తన ఓటరు కార్డును అధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.
Source: Eenadu
ఇక్కడ పచ్చదనంతో నిండిన గిరుల నడుమ..వయ్యారంగా పోతున్నది విశాఖపట్నం నుంచి అరకు మార్గంలో నడిచే రైలు. కొండల శిఖరాన రైలు ప్రయాణిస్తున్నప్పుడు... అంతెత్తు నుంచి లోయల అందాలు కనువిందు చేస్తాయి.
Source: Eenadu
వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో సిద్ధమైన మేరా భారత్ మహాన్ వినాయకుడు.
Source: Eenadu
ఖమ్మం నగరంలోని కొందరు చిన్నారులు తయారు చేసిన గణపతి విగ్రహాలు ఇవి. పండ్లు, కూరగాయలు, బిస్కెట్లు, తృణ ధాన్యాలు ఉపయోగించి ఇలా వినాయకుడి ప్రతిమలు రూపొందించారు.
Source: Eenadu
‘పుష్ప’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ ఈ ‘తగ్గేదే లే’ గణేశుడిని రూపొందించారు. ప్రస్తుతం ఈ విగ్రహం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Source: Eenadu