చిత్రం చెప్పే విశేషాలు! (31/08/2022/1)

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం పిడిచేడులోని బడిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఒకే ఆవరణలో ఉన్నాయి. పాఠశాల పైకప్పుపై నిర్మించిన దిల్లీలోని ఎర్రకోట ఆకృతి అందరినీ ఆకట్టుకుంటుంది.

Image:Eenadu

ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే నుంచి పెదవేగి మండలం విజయరాయి వెళ్లాలంటే తమ్మిలేరు దాటాల్సిందే. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఏడాది పొడవునా నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

Image:Eenadu 

కృష్ణా జిల్లా అవనిగడ్డ పంచాయతీ కాంప్లెక్స్‌లో అరటి పండ్ల దుకాణం నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు తన అరటి తోటలో అంతర పంటగా కంద మొక్కలు నాటారు. వాటిల్లో ఒకటి 10 అడుగులకుపైగా ఎత్తు పెరిగి చూపరుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

Image:Eenadu 

విజయనగరం బాలాజీ కూడలిలో 50 కిలోల వేరుశనగ కాయలతో తీర్చిదిద్దిన వినాయకుని విగ్రహం

Image:Eenadu

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మెయిన్‌ బజారులో

కొలువుదీరనున్న స్వర్ణలక్ష్మి మహాగణపతి విగ్రహం ఇది. బంగారపు పూతతో ఉన్న లక్ష లక్ష్మీ కాసులతో ప్రతిమకు అలంకరణ చేశారు. కెంపులు, పచ్చలు, అమెరికన్‌ వజ్రాలూ అలంకరణకు ఉపయోగించినట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్‌ పొట్టి రత్నబాబు తెలిపారు.

image:Eenadu

అక్కయ్యపాలెంలో ఓ గృహంలో పర్యావరణానికి మేలు చేసే రీతిలో పసుపు ముద్దతో వినాయకుని ప్రతిమను ఇలా తయారు చేశారు.

Image:Eenadu

తమిళనాడులోని నాగపట్నంలో ఆకట్టుకుంటున్న 32 అడుగుల గణేశుడి విగ్రహం.. దీనిని కలపతో తయారు చేశారు.

Image:Eenadu

హైదరాబాద్‌లో వినాయకుని ప్రతిమతో ఓ యువతి

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home