చిత్రం చెప్పే విశేషాలు! (31/08/2022/2)


కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో నందీశ్వర ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో రాముని అవతారంలో ఉన్న గణనాథుడిని ఏర్పాటు చేశారు.

Image:Eenadu

వినాయక చవితి సందర్భంగా మండపాల్లో విభిన్న రూపాల్లో ఉన్న వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ చోట ‘కేజీఎఫ్‌-2’లో యశ్‌ పాత్రను పోలిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Image:Eenadu

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ రూపొందించిన సైకత శిల్పం ఇది. 3,425 ఇసుక లడ్డూలు, పూలు వినియోగించి ఒడిశాలోని పూరీ తీరంలో దీనిని ఆయన తీర్చిదిద్దారు.

Image:Eenadu

హనుమకొండలోని గుడిబండల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వినాయకుడిని ఎత్తుకున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినూత్నంగా ఉన్న ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.

Image:Eenadu

విజయవాడ సమ్మెటవారి వీధిలో బాస్మతి బియ్యం ప్యాకెట్లతో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం

Image:Eenadu

నంద్యాల పట్టణం సంజీవ నగర్‌లోని కోదండ రామాలయంలో వెలసిన వేంకటేశ్వర స్వామిని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నవధాన్యాలతో అలంకరించారు.

Image:Eenadu

మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని సరస్వతి పాఠశాలలో వరిగడ్డితో తయారు చేసిన వినాయక విగ్రహం

Image:Eenadu

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శివయ్య రూపంలో గణనాథుడు

Image:Eenadu

కాకినాడ పెద్ద మార్కెట్లో 50వేల రాగి నాణేలతో ప్రత్యేకంగా తయారు చేసిన వినాయక విగ్రహం

Image:Eenadu

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధి గొల్లవీధిలో ఏర్పాటు చేసిన సింహాద్రి అప్పన్న రూప గణపతి

Image:Eenadu

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రామ మందిరం వద్ద అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆకారంలో..

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home