చిత్రం చెప్పే విశేషాలు!
(01-09-2022/1)
కాలిఫోర్నియాలోని కాస్టాయిక్‌లో భారీ కార్చిచ్చు రేగింది. ఆ సమయంలో గాలులు తీవ్రంగా వీయడంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
Source: Eenadu
వినాయక చవితి సందర్భంగా కొంత మంది చిన్నారులు తమ సృజనకు పదును పెడుతున్నారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని యశస్విని మందార పత్రాలతో వినాయక రూపం తయారు చేసింది.
Source: Eenadu
ముంబయి మహా నగరంలో 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితో తయారు చేసిన గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి రూ.200 కోట్లకు పైగా ఖర్చయినట్లు సమాచారం.
Source: Eenadu
విశాఖలోని గాజువాక లంక మైదానంలో 89 అడుగుల భారీ గణపతి కొలువుదీరాడు. దీంతో విశాఖ నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Source: Eenadu
ఉక్రెయిన్‌లోని క్రమటోర్స్క్ పట్టణంపై గత జులై నెలలో రష్యా బాంబు దాడులు జరిపింది. దీంతో అక్కడి ఓ పాఠశాల భవంతిలోని గ్రంథాలయంలో పాఠ్య పుస్తకాలు ఇలా చెల్లా చెదురుగా పడిపోయాయి. గ్రంథాలయ నిర్వాహకురాలు రైసా కృప్‌చెంకో మళ్లీ ఇలా పుస్తకాలను సేకరించారు.
Source: Eenadu
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైతెపా అధినేత్రి వైయస్ షర్మిల నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నారు.
Source: Eenadu
ముంబయిలోని విలే పార్లే పోలీస్‌స్టేషన్లో ఈ వినూత్న గణనాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. నేరాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ‘పోలీస్ బప్పా’ను ఏర్పాటు చేశామని అక్కడి సిబ్బంది తెలిపారు.
Source: Eenadu