చిత్రం చెప్పే విశేషాలు! (23-07-2022)
కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో హర్‌కీ పౌరి ఘాట్ వద్ద హెలికాఫ్టర్ ద్వారా భక్తులపై పూలు కురిపిస్తున్న నిర్వాహకులు.
హైదరాబాద్ శివారులోని మోకిల- పొద్దటూర్ గేట్ల మధ్య 7 నెలల క్రితం సెంటర్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు వాటికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వలేదు. వీధి దీపాలకు కనెక్షన్ ఇచ్చి వినియోగంలోకి తేవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
#Eenadu
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం దిల్లీలో ఇచ్చిన విందుకు తెలంగాణ నుంచి హాజరైన పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగిలయ్య, తదితరులు.
#Eenadu
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌లోకి వరద నీరు చేరి ఇబ్బందులు ఎదురయ్యాయి. బత్తాయిలు కొట్టుకుపోయాయి. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
#Eenadu
గోల్కొండ నయాఖిల్లా ప్రాంగణంలో ఉన్న వందల ఏళ్ల ప్రాశస్త్యం కలిగిన మహావృక్షం ఇది. దేశ సంచారం చేసే మౌల్వీలు కొందరు మడగాస్కర్ నుంచి తెచ్చి ఇక్కడ నాటారు. దీనిని స్థానికులు ఏనుగు వృక్షంగా పిలుస్తారు. వేసవిలో ఆకులు పూర్తిగా రాలిపోగా.. ఇటీవల వర్షాలకు పచ్చదనం సంతరించుకొంది.
#Eenadu
సిద్దిపేట కోమటిచెరువు (మినీట్యాంకు బండ్).. నిత్య నూతనత్వంతో ఆకట్టుకుంటోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు వివిధ రకాల సదుపాయాలు, అదనపు హంగులు సమకూర్చుతున్నారు. చెరువు వద్ద నెక్లెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా చిన్నారులకు ఆట వస్తువులు అందుబాటులోకి తెచ్చారు.
#Eenadu
ఉదయం నల్లరాతి శోభ.. రాత్రి స్వర్ణ వర్ణ విద్యుత్తు దీప కాంతుల్లో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వైభవాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ ముగ్ధమనోహర దృశ్యాలను శుక్రవారం చూసిన భక్తులు మైమరచిపోయారు.
#Eenadu
హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీ సహా పలు ఇతర ప్రాంతాల్లో మహిళలు బోనాలు సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా లాల్‌దర్వాజా సింహవాహినీ మహంకాళి అమ్మవారికి శుక్రవారం 51 రకాల మిఠాయిలతో నైవేద్యం సమర్పించారు.
#Eenadu