చిత్రం చెప్పే విశేషాలు! (09-08-2022/1)

జమ్ములో సోమవారం నిర్వహించిన తిరంగా బైక్‌ ర్యాలీలో పాల్గొన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది

image:Twitter

ఎగువనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లాలోని డిండి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 36 అడుగుల (గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.45 టీఎంసీల)కు చేరింది.

image:Eenadu  

విశాఖ ఆర్కేబీచ్‌ ఆల్‌ఎబిలిటీస్‌ పార్కు పక్కన కొబ్బరి తోటల్లో ఆకతాయిల నిత్యం మద్యం తాగి పెద్ద సంఖ్యలో సీసాలను పారేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆ మద్యం సీసాలను ఏరి సంచుల్లో పెట్టి(చిత్రంలో) తరలిస్తున్నారు.

image:Eenadu


విశాఖ నగరం తడిసి ముద్దయింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. రోజు కూలీలు పని దొరక్క ఇంటిబాట పట్టారు. అత్యవసర ప్రయాణాలు చేసేవారంతా జల్లుల్లోనే వెళ్లాల్సి వచ్చింది.

image:Eenadu  

విశాఖ ఆర్కేబీచ్‌ రోడ్డులో స్పెన్సర్స్‌ కూడలి వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ దీపాలు పట్టు తప్పాయి. గాలికి అటు.. ఇటూ ఊగుతుండటంతో ఎవరిపై పడతాయోనని అటుగా వచ్చేవారు హడలిపోతున్నారు.

image:Eenadu

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా లాంక్‌షైర్‌లో చిన్నారితో ముచ్చటిస్తున్న బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌

image:Twitter


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ డి.అచ్యుత జానకి అధ్యక్షతన నిర్వహించిన మండల సమీక్ష సమావేశంలో ఎంపీపీ భర్త రాంబాబు సభా వేదికపై అధికారులతోపాటు కూర్చున్నారు. దీనిపై పలువురు అభ్యంరతం వ్యక్తం చేశారు. image:Eenadu 


మీ కాళ్లు మొక్కుతా.. నాకు ఇల్లు మంజూరు చేయండి.. భర్త మృతిచెందాడు.. ఉండటానికి గూడు లేదు.. వర్షాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నా అని తిరుపతి జిల్లా సీఎల్‌ఎన్‌పల్లి పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన చెంగమ్మ..ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట కన్నీరుమున్నీరైంది.

image:Eenadu  


చిత్రం చెప్పే విశేషాలు(05-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(04-07-2025)

Eenadu.net Home