చిత్రం చెప్పే విశేషాలు! (02/09/2022/2)
సినీనటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Image:Eenadu
కేజీఎఫ్ సినిమా కథాంశంతో హైదరాబాద్‌లోని గౌలిబస్తీలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా యశ్ ప్రతిమను సైతం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి భక్తులు ముగ్ధలవుతున్నారు.
Image:Eenadu
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Image:Eenadu
పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కళాకారుడు మానస్ సాహు ఒడిశాలోని పూరీ తీరంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు.
Image:Eenadu
మాస్ట్రో ఇళయరాజా బుడాపెస్ట్‌లోని సింఫనీ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి ‘మ్యూజిక్ స్కూల్’ అనే సినిమా సంగీత ఆల్బమ్‌కు స్వరకల్పన చేశారు. ఈ సినిమాలో 11 పాటలు ఉన్నట్లు సమాచారం. శ్రియ, శర్మన్ జోషి ‘మ్యూజిక్ స్కూల్’లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Image:Eenadu
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ.. తన సతీమణి అనుష్కశర్మను భానుడి లేలేత కిరణాలు తాకుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆమే తన ప్రపంచం అని అర్థం వచ్చేలా ఎమోజీలతో పోస్టు పెట్టారు.
Image:Eenadu
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ సామాజిక మాధ్యమ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Image:Eenadu
చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో బాబీ దర్శకత్వంలో ‘మెగా 154’ వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. కీలక ఘట్టాలతో కూడిన కొత్త షెడ్యూల్ చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్రబృందం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంది.
Image:Eenadu