చిత్రం చెప్పే విశేషాలు! (03/09/2022/1)
నంబూరులోని జయభారత్‌రెడ్డినగర్లో వినాయక ఊరేగింపు సందర్భంగా 500 కిలోల ఐస్‌తో ఏర్పాటుచేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది క్రమంగా కరుగుతూ 6గంటల వరకు ఉంటుందని దీని రూపకర్తలు చెప్పినట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
Image:Eenadu
20 అడుగులు, సత్యనారాయణస్వామి రూపంలో వినాయకుడు (నింబోలిఅడ్డా, అంబర్‌పేట)
Image:Eenadu
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటు చేసిన నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఆకట్టుకుంటున్న రెండు తలల తాబేలు. దీని 25వ పుట్టిన రోజును శనివారం ఘనంగా నిర్వహించేందుకు అక్కడి సిబ్బంది ఏర్పాట్లు చేయడం విశేషం.
Image:Eenadu
41 అడుగులు, శ్రీరామభద్ర మహా గణేశుడు (బాలాజీ నగర్, కొత్తపేట)
Image:Eenadu
సంధ్యా సమయంలో.. పసిడి వర్ణ విద్యుద్దీప కాంతులతో శుక్రవారం కనువిందు చేస్తోన్నయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధి.
Image:Eenadu
అలియాబాద్ గొల్లగూడలో ఆకట్టుకుంటున్న లంబోదరుడు
Image:Eenadu
తెలంగాణ ప్రభుత్వం రూ.600 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. కార్మికులు మూడు షిఫ్టుల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ముందు భాగంలోని గదుల్లో విద్యుద్దీపాల వల్ల భవనం వెలుగులీనుతోంది.
Image:Eenadu
నాగులచింత ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడు
Image:Eenadu