చిత్రం చెప్పే విశేషాలు! (03/09/2022/2)

మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సుమంతో చౌదరీ అనే కళాకారుడు తన పెయింటింగ్స్‌, కళాఖండాలతో ‘మై పిక్చోరియల్‌ స్పేస్‌’ పేరుతో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ ప్రారంభించారు.

Image:Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఓ సంస్థ తన నూతన ఎల్‌ఈడీ లైట్లను లాంచ్‌ చేసింది. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Image:Eenadu


మంత్రి కేటీఆర్‌ ఓ ఆసక్తికర ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తన తాత కేశవరావుతో తాను, ఎమ్మెల్సీ కవిత బాల్యంలో కలిసి దిగిన ఫొటో ఇది. కేశవరావు.. మహాత్మాగాంధీ స్ఫూర్తితో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Image:Eenadu

పేద బాలికలకు ఉన్నత విద్యనందించే లక్ష్యంతో హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, మరో పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను ప్రముఖ సినీనటుడు చిరంజీవి అభినందించారు.

Image:Eenadu 

భారీవర్షాలతో పాకిస్థాన్‌లోని జఫరాబాద్‌ జిల్లాలో వరదలు ముంచెత్తాయి. దీంతో పలువురు యువకులు పెద్దలను ఇలా మంచంపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

Image:Eenadu 

హైదరాబాద్‌లోని గండిపేట పార్కును హెచ్‌ఎండీఏ అన్ని హంగులతో తీర్చిదిద్దింది. ఇందులో ఓ బహిరంగ వేదిక, ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని ప్రదేశాలున్నాయి. ఈ ఫొటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకొని హెచ్‌ఎండీఏ పనితీరును కొనియాడారు.

Image:Eenadu 


పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఖైరతాబాద్ మహా గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Image:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home