చిత్రం చెప్పే విశేషాలు..!
(04-09-2022/2)
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ‘చిరు భద్రత’ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఒకేసారి 18 వేల మంది శ్రీమద్భగవద్గీత సంపూర్ణ పారాయణం చేశారు.
Source: Eenadu
ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
Source: Eenadu
హిన్నామ్నోర్ టైఫూన్ కారణంగా దక్షిణ కొరియా యోసు, బుసాన్‌లోని ఓడరేవుల్లో చేపల బోట్లను ఇలా నిలిపి ఉంచారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో వినూత్న అవతారంలో గణపతి కొలువుదీరాడు. ఇక్కడ వినాయకుడు క్రికెట్ బ్యాటర్‌గా, మూషికుడు బౌలర్‌గా, బసవన్న అంపైర్‌గా ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు.
Source: Eenadu
ప్రగతి భవన్‌లోని వినాయకుడి విగ్రహానికి సీఎం కేసీఆర్, శోభ దంపతులు, వారి మనమడు హిమాన్షు పూజలు, హోమాలు నిర్వహించారు.
Source: Eenadu
ఆదివారం సెలవు దినం కావడంతో ఖైరతాబాద్ మహా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Source: Eenadu
ఆసియా కప్ పోటీల్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్‌ల మధ్య సూపర్4 మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన భారత్, పాకిస్థాన్ అభిమానులు ఇద్దరు తమ ప్రత్యర్థి దేశం జెండాను ప్రదర్శించి స్నేహ భావాన్ని చాటారు.
Source: Eenadu