చిత్రం చెప్పే విశేషాలు! (05/09/2022/1)

రూఫస్‌ టెయిల్డ్‌ లార్క్‌ పక్షులు రాళ్లు, రప్పలు ఉండే ప్రాంతాలను ఆవాసంగా చేసుకుంటాయి. పాకిస్థాన్‌, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ పక్షుల ఫొటోల్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Image:Eenadu

చిత్రంలో కనిపిస్తున్నది ఏడు పదుల వయసున్న వృద్ధుడు కాదు. కేవలం అయిదేళ్ల బాలుడు.పేరు మధు. శరీరమంతా ముడతలుపడటంతో మహబూబ్‌నగర్‌ నుంచి నిలోఫర్‌ ఆసుపత్రికి వచ్చాడు. జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నాడని, ఇది లక్ష మందిలో ఒకరికి వస్తుందని వైద్యులు తెలిపారు.

Image:Eenadu

ఈ చిత్రంలో చూడండి.. ఇక్కడున్న హైటెన్షన్‌ కరెంటు స్తంభాలన్నీ ఒరిగిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు పడతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలోని పోలకంపాడు రాధాస్వామి సత్సంగ్‌ వెనుక పంట పొలాల్లో కనిపించిన దృశ్యమిది.

Image:Eenadu

సహజ సిద్ధ కొండలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. సెలవు దినాల్లో ఖాజాగూడలో ట్రెక్కింగ్‌, క్లైంబింగ్‌ కార్యక్రమాలు చేపడుతూ ఆకట్టుకుంటున్నాయి.

Image:Eenadu

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన చిత్రకారుడు శివకుమార్‌ రావి ఆకుపై సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రాన్ని మలిచి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Image:Eenadu

చుట్టూ అందమైన అటవీ ప్రాంతం. మధ్యలో కోట్‌పల్లి పాజెక్టు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో పర్యాటకులు కోట్‌పల్లి అందాలను తిలకించడానికి వస్తున్నారు.

Image:Eenadu

చుట్టూ అందమైన అటవీ ప్రాంతం. మధ్యలో కోట్‌పల్లి పాజెక్టు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో పర్యాటకులు కోట్‌పల్లి అందాలను తిలకించడానికి వస్తున్నారు.

Image:Eenadu

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేశ్‌ చారి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆదివారం అంగుళం సుద్ద ముక్కపై ఆయన ప్రతిమను చెక్కి తన ప్రతిభను చాటుకున్నారు.

Image:Eenadu 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home