చిత్రం చెప్పే విశేషాలు! (05/09/2022/2)

న్యూజెర్సీలోని టర్టిల్‌ బ్యాక్‌ జూకు వెళ్లిన వ్యక్తి అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యాడు. అక్కడి చిరుత బోనులో అతడికి కుక్క కనిపించింది. దీంతో కడుపుబ్బా నవ్వుకున్న ఆ వ్యక్తి ఐదు రోజుల క్రితం సంబంధిత ఫొటోను రెడిట్‌ సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.

 Image:Eenadu

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ వారాసిగూడ ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో సందడి చేశారు.

Image:Eenadu

గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో సినీనటుడు అల్లు అర్జున్‌ తన కుమార్తె అల్లు అర్హతో కలిసి సందడి చేశారు.

Image:Eenadu

గుజరాత్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అక్కడి సబర్మతి ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి నివాళి అర్పించారు.

Image:Eenadu

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

 Image:Eenadu

బెంగళూరు మహా నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. ఇళ్ల నుంచి కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షపు నీటిలో అవస్థలు పడ్డారు.

Image:Eenadu

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయనతో పలువురు అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.

Image:Eenadu

మదర్‌ థెరిసా 25వ వర్ధంతి సందర్భంగా కోల్‌కతాలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీలో ఉన్న ఆమె సమాధి వద్ద నన్స్‌ నివాళి అర్పించారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home