చిత్రం చెప్పే విశేషాలు! (06/09/2022/1)
హైదరాబాద్ నగరంలో వినాయకుడి నిమజ్జన వేడుకలు జోరుగా సాగుతున్నాయి. యువతీ యువకులు నృత్యాలతో ఉత్సాహంగా గణనాథుడిని తరలిస్తున్నారు.
Image:Eenadu
రాష్ట్రపతి ద్రౌపదీముర్మును హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ఆయన రాష్ట్రపతితో భేటీ అయ్యారు. హరియాణా రాష్ట్ర పరిస్థితులను ఆమెకు వివరించారు.
Image:Eenadu
బిహార్ రాజధాని పట్నాలో సోమవారం లాలూ ప్రసాద్‌తో ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, లాలూ సతీమణి రబ్రీదేవి
Image:Eenadu
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గురుపూజోత్సవం నేపథ్యంలో సోమవారం విశాఖ నగరం సిరిపురంలోని వి.ఎం.ఆర్.డి.ఎ. బాలల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు అలరించాయి.
Image:Eenadu
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గుండె సంబంధిత రోగాలకు సంబంధించి సోమవారం ఓపీ విభాగానికి రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుర్చీలు లేక నేలపై కూర్చొని లేవాలంటే ఆయాసం వచ్చి రక్తపోటు పెరిగిపోతోందని కొందరు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
Image:Eenadu
ధర్మపురి హన్మాండ్లగడ్డ వద్ద కరకట్ట మాదిరి ఉన్న మట్టిదిబ్బ గోదావరి వరదల్లో కోతకు గురైంది. దీంతో పట్టణంలోకి వేగంగా వరద నీటి ప్రవాహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.కోతకు గురైన చోట్ల బండరాళ్లతో రాతికట్టను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
Image:Eenadu
లక్షెట్టిపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తులు సోమవారం 108 రకాల నైవేద్యాలు అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Image:Eenadu
విషజ్వరాలు, అంటువ్యాధుల బెడద పెరుగుతుండడంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటికిటలాడుతున్నాయి. సోమవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగానికి భారీగా రోగులు వచ్చారు.
Image:Eenadu