చిత్రం చెప్పే విశేషాలు! (06/09/2022/2)
బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న లిజ్ ట్రస్.. రాణి ఎలిజబెత్ 2ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ పాలెస్‌కు వచ్చిన లిజ్ ట్రస్‌తో రాణి కరచాలనం చేసి అభినందనలు తెలిపారు.
Image:Eenadu
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 144వ రోజుకు చేరింది. పాదయాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు క్రాస్ వద్ద ఓ పత్తి చేలో దిగి కూలీలతో మాట్లాడారు. గోరుముద్దలు తినిపిస్తూ.. తినిపించుకొని వారితో కలిసి భోజనం చేశారు.
#Eenadu
పాకిస్థాన్‌లో అసాధారణ వరదల కారణంగా వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు నీట మునిగి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో హైదరాబాద్‌లో వారి కోసం ఈ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు.
Image:Eenadu
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అక్కడే దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
Image:Eenadu
దక్షిణ కొరియాపై హిన్నామ్నోర్ తుపాను విరుచుకుపడుతోంది. బలమైన గాలులు వీస్తుండటంతో బారికేడ్లు, దుకాణ సముదాయాల అద్దాలు ధ్వంసమయ్యాయి. తీరంలో పలు చోట్ల అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Image:Eenadu
తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
Image:Eenadu
జడ అల్లికను పోలిన ఆకులు కలిగిన ఈ మొక్క పేరు సైల్లోడియం పుల్చెల్లుం. దీనిని సీతమ్మ జడ అని కూడా పిలుస్తుంటారు. కడియం మండలం బుర్రిలంకకు చెందిన నర్సరీ రైతు రావిపాటి ఆది నారాయణ ఈ మొక్కను పెంచుతున్నారు.
Image:Eenadu
హైదరాబాద్ మహానగరంలో వాతావరణ మార్పుల కారణంగా జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని ఓపీ విభాగం కిక్కిరిసిపోతోంది. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న పలువురు రోగులు చికిత్స పొందేందుకు ఇలా క్యూలో వేచి ఉన్నారు.
Image:Eenadu