చిత్రం చెప్పే విశేషాలు! (07/09/2022/1)
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఏవీఆర్ ప్రైవేటు పాఠశాలను వరద చుట్టుముట్టింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నీటిలో బల్లలు వేసి విద్యార్థులను పాఠశాలలోకి పంపారు. సెయింట్ పాల్ ఆంగ్లమాధ్యమ పాఠశాల చుట్టూ వరదనీరు చేరింది.
Image:Eenadu
కరీంనగర్ టవర్ సర్కిల్‌లో కొబ్బరికాయను తొలిచి వినాయకుడిగా మలిచిన దృశ్యం ఇది
Image:Eenadu
నిజామాబాద్ మార్కెట్లో బెండకాయలు హోల్‌సేల్‌గా కిలో కేవలం రూ.4కు అమ్ముడు పోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో మాక్లూర్ మండలం కృష్ణానగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు మనోవేదనకు గురై మంగళవారం ఎకరంన్నర పంటను ట్రాక్టర్‌తో ఇలా తొక్కించేశారు.
Image:Eenadu
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి మెయిన్ బజార్‌లో సంకా బ్రదర్స్, ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య, ఎస్‌బీజీ యూత్ సంయుక్తంగా గణనాథునికి రూ.2 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో మంగళవారం అలంకరించారు.
Image:Eenadu
బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన క్రమంలో లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ (అధికారిక నివాసం) నుంచి మంగళవారం బయటకు వస్తున్న బోరిస్ జాన్సన్, ఆయన సతీమణి కెర్రీ
Image:Eenadu
నిత్యం వేలాది మంది ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. సరిపడా బస్సులు లేక ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ఇలా ఒకరికొకరు సహాయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. సాగర్ ప్రధాన రహదారి బొంగుళూర్ కూడలి వద్ద చిత్రమిది.
Image:Eenadu
ఐటీ కారిడార్‌లో ఉండే పేదలకు గ్యాస్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పెరిగిన ధరలతో కొందరు తట్టుకోలేక వంట కోసం కట్టెలను ఉపయోగిస్తున్నారు. సుదూర ప్రాంతానికి ద్విచక్ర వాహనాలపై వెళ్లి కట్టెలను తెచ్చుకుంటున్నారు.
Image:Eenadu
హైదరాబాద్ జూపార్కులోని జిరాఫీల ఎన్‌క్లోజరులో బసంత్, బంటి అనే జిరాఫీలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు వాటి ఎన్‌క్లోజరు ముందుకు రాగానే తమ పొడవైన మెడను ఎత్తి వారి వైపు చూడటంతో సందర్శకులు ముచ్చటపడి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Image:Eenadu