చిత్రం చెప్పే విశేషాలు! (07/09/2022/2)

భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగోలియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంగోలియా అధ్యక్షుడు ఖురేల్‌సుఖ్‌ ఓ అశ్వాన్ని బహూకరించారు. దానికి తాను ‘తేజస్‌’గా నామకరణం చేసినట్లు వెల్లడిస్తూ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు.

Image:Eenadu

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర’ బుధవారం ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న రాజీవ్‌ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.

Image:Eenadu

ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని సినీనటులు రామ్‌ పోతినేని, రీతూవర్మ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image:Eenadu

భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం, మంచి చేకూరాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

Image:Eenadu

ఎగువన ఉన్న కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నదికి వరదలు వచ్చాయి. దీంతో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మిడ్‌ పెన్నార్‌ జలాశయం 8 గేట్లు ఎత్తారు. ఓ వైపు జలసవ్వడులు, మరో వైపు అక్కడి పచ్చందాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడంలేదు.

Image:Eenadu

ఇటీవల ముంబయిలో జరిగిన పోటీల్లో ‘మిస్‌ దివా సుప్రానేషనల్‌ 2022’ టైటిల్‌ను గెలుచుకున్న తెలంగాణ యువతి ప్రజ్ఞా అయ్యంగారి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు అపూర్వమైన స్వాగతం పలికారు.

Image:Eenadu

సినీనటి పూనమ్‌కౌర్‌ ఖైరతాబాద్‌లోని మహా గణపయ్యను దర్శించుకొని పూజలు చేశారు. Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home