చిత్రం చెప్పే విశేషాలు! (08/09/2022/1)

నన్నయ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన యాంత్రిక్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వ్యర్థలోహాలతో విద్యార్థులు చేసిన వివిధ రూపాలు ఆకట్టుకున్నాయి.

Image:Eenadu

ఈ చిత్రాన్ని చూస్తే గుర్రంలా కనిపిస్తుంది కదూ!. ఇది ప్రకృతి చేసిన విచిత్రం. జయశంకర్‌ జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావ్‌పల్లి శివారులో విరిగిన ఓ వృక్షం మోడువారి ఇలా గుర్రం పోలికగా మారింది. దీనిని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

Image:Eenadu

పల్లెల్లో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలు ఆదిలోనే అభాసుపాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఆరెపల్లి గ్రామ గై చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో నీళ్లుండి అసౌకర్యంగా మారిన దృశ్యమిది.

Image:Eenadu

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోని దొంతికుంట తండా ఆదర్శ పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు పడుతున్న పాట్లు ఇవి. సరిపడా బస్సులు లేక ఫుట్‌బోర్డులపై, బస్సుల వెనకాల వేలాడుతూ ప్రమాదకంగా ప్రయాణాలు చేస్తున్నారు.

Image:Eenadu

మెదక్‌ జిల్లా రామాయంపేటలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వినాయకుడికి 108 రకాల నైవేద్యాలతో మహా నివేదన చేపట్టారు. అంతకుముందు విశేష పూజలు చేశారు.

Image:Eenadu

పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం ఉన్నత పాఠశాల శిథిలమైపోయి ప్రమాదకరంగా ఉంది. ఈ పాఠశాలలో 170 మంది విద్యార్థులున్నా.. నాడు-నేడు కింద చేర్చలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

Image:Eenadu

మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరు ఘాట్‌ మార్గంలో బుధవారం అమ్మవారి పాదాలు దాటిన తర్వాత నుంచి వంట్లమామిడి వరకు దట్టంగా పొగమంచు కురిసి ఆకట్టుకుంది. పాడేరు పట్టణంలోని కలెక్టర్‌ బంగ్లా వద్ద పొగమంచు కమ్ముకుంది.

Image:Eenadu

ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి సమీపంలోని పట్టిసీమ కాల్వలో ఉన్న వినాయక విగ్రహాలివి. పట్టిసీమ కాల్వలో నీరు కొద్దిగా మాత్రమే ఉంది. ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను పట్టిసీమ కాల్వలోఉన్న కొద్దినీటిలోనే నిమజ్జనం చేశారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home