చిత్రం చెప్పే విశేషాలు! (09/09/2022/1)

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్లేపల్లి-గుంతపల్లి మార్గంలో ఓ రైతు మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. చేను మధ్యలో కొంత భాగంలో బంతిపూల సాగు చేపట్టారు. రహదారికి సమీపంలో ఆ చేను ఉండటంతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

#Eenadu

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్టీసీ అందిపుచ్చుకుంటోంది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో డిజిటల్‌ పేమెంట్‌ విధానం అమలుచేస్తోంది. విశాఖపట్నంలోని ఓ బస్సులో తీసిన చిత్రమిది.

#Eenadu

ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయిలో నీరు చేరడంతో ఏడు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. దీంతో పరవళ్లు తొక్కుతూ పెన్నానదిలోకి ప్రవాహం సాగిపోతోంది.

#Eenadu

నిత్యం రద్దీగా ఉండే నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి కొన్నిచోట్ల పూర్తిగా గోతులమయమైంది. చింతపల్లి నుంచి చిన్నగెడ్డ, పెద్దగెడ్డ, కొలపరి సమీపంలో ప్రధాన రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. గోతులమయమైన ఈ రోడ్డును బాగుచేయాలని ఈ ప్రాంత ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.

#Eenadu

మండల కేంద్రం పెద్దేముల్‌లో గురువారం పోషణ మాసోత్సవం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రం 3లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీలో లభించే సేవలను వివరించారు. కూరగాయలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఆకృతులు ఆకట్టుకున్నాయి.

#Eenadu

వెల్దుర్తి పంచాయతీ కోమటిపల్లిలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గణనాథుడికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

#Eenadu

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో రహదారి మధ్యలో గుంత పడింది. రోగులను అప్రమత్తం చేసేందుకు సిబ్బంది వీల్‌ఛైర్‌ను ఇలా గుంతలో ఉంచారు. గుంతను పూడ్చకుండా ఇలా వీల్‌ఛైర్‌ను వాడటంపై రోగులు, సహాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

#Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పలు గ్రామాలలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాలలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బోథ్‌లోని కండ్రె వాగు పొంగడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home