చిత్రం చెప్పే విశేషాలు! (09/09/2022/2)

ముంబయిలో నిర్వహించిన గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా చెరువుల వద్దకు వెళ్లి గణపయ్యకు వీడ్కోలు పలికారు.

Image:Eenadu

సికింద్రాబాద్‌లోని చిలకలగూడ జీహెచ్ఎంసీ మైదానంలో అమీషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Image:Eenadu

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో సిద్ధమవుతోన్న ప్రాజెక్ట్‌ #RC15. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి శుక్రవారం ఓ సరికొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఎస్‌.జె.సూర్య ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోన్నట్లు చిత్రబృందం ప్రకటించింది. Image:Eenadu

బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివాళి అర్పిస్తూ సిడ్నీలోని ఒపెరా హౌజ్‌పై ఆమె ఫొటోను ప్రదర్శించారు.

Image:Eenadu

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహ నిమజ్జన ఉత్సవంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. గణపతి విగ్రహాన్ని తీసుకెళ్లి ట్రాక్టర్‌లో పెట్టి స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ నిమజ్జనం చేసే చోటుకు తీసుకెళ్లారు.

Image:Eenadu

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ వారాంతాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక విమానంలో వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరీమణులు సుస్మిత, శ్రీజ, ఇతర కుటుంబ సభ్యులు, తన పెంపుడు శునకం రైమ్‌తో కలిసి ఈ ఫొటోలు దిగారు.

Image:Eenadu

ఇంగ్లాండ్‌లోని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వద్ద ఆకాశంలో రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడి ఆకట్టుకున్నాయి. ఇలా రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడటం మృతి చెందిన వారి ఆత్మ స్వర్గానికి చేరడానికి సంకేతమని క్వీన్‌ ఎలిజబెత్‌-2ను దృష్టిలో ఉంచుకొని పలువురు భావిస్తున్నారు.

Image:Eenadu 

కర్నూలులోని శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడి జల సవ్వడులు, పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. జలాశయాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home