చిత్రం చెప్పే విశేషాలు! (23-07-2022)

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విమానంలో ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స అందించారు. దిల్లీ - హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేశారు. 

#Twitter

శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను శనివారం తెరిచారు. అంతకుముందు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రాజెక్టులోని 6, 7, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. #Eenadu

తిరుపతి ఆడిటోరియంలో 44వ చెస్‌ ఒలింపియాడ్‌ టార్చ్‌ రిలే నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి రోజా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నీలోత్పల్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

#Eenadu

ఆడికృత్తిక సందర్భంగా శనివారం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా తిరుత్తణి సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. తితిదే తరఫున ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

#Eenadu

భారత్‌-వెస్టిండీస్‌ తొలి వన్డేలో ఒక ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్‌లో క్రికెట్‌ దిగ్గజాలు రాహుల్‌ ద్రవిడ్‌, బ్రియాన్‌ లారా కలిశారు. మ్యాచ్‌ జరుగుతుండగా విండీస్‌ మాజీ క్రికెటర్‌ లారా మైదానానికి వెళ్లి టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను కలిసి సరదాగా ముచ్చటించారు.

#Eenadu

మంత్రి కేటీఆర్‌ జన్మదినం ఆదివారం రోజున ఉంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రా గ్రామంలోని ప్రజలు ఆయనకు జన్మదిన కానుకగా 2వేల మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు.

#Eenadu

హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాజుల రామారంలోని వొక్లిత్ ఎంక్లేవ్‌లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. పలు ఇళ్లలోకి సైతం వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

#Eenadu


రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం రామ్‌నాథ్‌ కోవింద్‌ను కుటుంబ సమేతంగా తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఇచ్చారు.

#Eenadu


స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించేందుకు దిల్లీలోని సెంట్రల్‌ పార్కులో స్కై బీమ్‌ లైట్‌ను ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్‌ జ్యోతితో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవచ్చని ప్రధాన నరేంద్ర మోదీ తెలిపారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home