చిత్రం చెప్పే విశేషాలు! (10/09/2022/1)

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు శుక్రవారం ఐస్‌క్రీమ్‌ పుల్లలతో కాళోజీ చిత్రాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Image:Eenadu


రంగారెడ్డి జిల్లా మణికొండ పరిధి ఖాజాగూడ కొండల్లో ‘కొండనాలుక’గా పేరొందిన సహజసిద్ధ రాతి రూపమిది. నాలుకలా కనిపించే రాయిని సందర్శకులు హిల్‌టంగ్‌గా పిలుచుకుంటారు. మరికొందరు తాబేలులా కనిపిస్తుందని చెప్పుకొంటారు.

Image:Eenadu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రాంనగర్‌ కాలనీలో తూర్పు కాపు సంఘం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపంలో ఎస్పీ నాయుడు, మల్లేశ్‌ల ఆధ్వర్యంలో రూ.కోటి విలువైన నోట్లతో ‘లక్ష్మీ గణపతి’ అలంకరణ చేశారు.

Image:Eenadu 

దేశ రాజధాని దిల్లీలో కర్తవ్య పథ్‌ను సందర్శించేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో తరలి వచ్చిన పర్యాటకులు

Image:Eenadu

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను విమర్శిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ కొత్త ప్రచారానికి తెర తీసింది. టీషర్టులపై అమిత్‌ షా కార్టూన్‌ను ముద్రించి భారత దేశ అతి పెద్ద ‘పప్పు’ అన్న వ్యాఖ్యను జోడించింది. వాటిని ధరించి తృణమూల్‌ శ్రేణులు ర్యాలీలకు సిద్ధమవుతున్నాయి.

#Eenadu

పక్షుల్లో గిజిగాడు పక్షికి ఓ ప్రత్యేకత ఉంది. వాటి గూడు నిర్మాణంలో అవి అద్భుత నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. కరీంనగర్‌ శివారు ఇరుకుల్ల గ్రామ శివారులో కొన్ని పక్షులు ఇలా తమ గూడు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.

Image:Eenadu 

కృష్ణా నదికి వరద పెరగడంతో పాత ఎడ్లంకకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అధికారులు ఒక్క పడవను మాత్రమే ఏర్పాటు చేశారు. శుక్రవారం విద్యార్థులు, గ్రామస్థులు ఆ పడవ కోసం నిరీక్షిస్తున్న దృశ్యమిది.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home