చిత్రం చెప్పే విశేషాలు! (10/09/2022/2)

సినీ నటుడు రామ్‌చరణ్‌ తన తాజా ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఇందులో నల్లటి దుస్తుల్లో ఉన్న ఆయన.. అద్దంలో ముఖం చూసుకుంటూ కనిపించారు. ‘వర్క్‌ మూడ్‌’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.

#Eenadu

ప్రముఖ సినీనటి కృతిశెట్టి హనుమకొండ నక్కలగుట్టలో ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కృతిశెట్టిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

#Eenadu

కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తమిళనాడులో కొనసాగుతోంది. నాలుగు రోజు పాదయాత్రలో భాగంగా పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి పలువురు చిన్నారులు స్వాగతం పలుకుతూ సందడి చేశారు.

#Eenadu

జర్మనీలోని పీటర్స్‌డార్ఫ్‌లో ఆకాశం ఇలా గర్జించినట్లు ఉరుములు, మెరుపులతో కనిపించింది. గత రాత్రి అక్కడి బ్రాండెన్‌బర్గ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

#Eenadu

అమెరికాలోని కన్సాస్‌ నగరంలో భవనాల మధ్య నుంచి చంద్రుడు(ఫుల్‌ మూన్‌) నిండుగా భారీస్థాయిలో కనిపించి ఆకట్టుకున్నాడు.

#Eenadu

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రహదారులు జలమయమై వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.

#Eenadu

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా పాడేరు జిల్లా వరరామచంద్రాపురం మండలంలోని అన్నవరం వాగుపైనున్న లోలెవల్‌ కాజ్‌వే వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.అత్యవసర పనుల మీద వచ్చేవారు అవస్థలు పడుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాగు దాటుతున్నారు.

#Eenadu

విశాఖలోని గాజువాకలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన 89 అడుగుల భారీ వినాయక మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. సోమవారం సాయంత్రం ఈ గణనాథుడికి నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయించింది.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home