చిత్రం చెప్పే విశేషాలు
(12-09-2022/1)
కామారెడ్డి జిల్లా కౌలాస్‌నాలా జలాశయం డీ-2 కాలువ గట్టున పచ్చని చెట్లకు వందలాది వెచ్చని గూళ్లను ఏర్పాటు చేసుకున్నాయి పక్షులు. ఒక్కో గడ్డిపూసను ముక్కుతో పేర్చి కట్టుకున్న అందమైన గూళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
Source: Eenadu
హనుమకొండలో సినీనటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. ఆదివారం వన్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.
Source: Eenadu
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఇది. ఇక్కడి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు జాడి శ్రీనివాసరావు రూ.50వేలు వెచ్చించి పాఠశాల గోడలు, వరండాపై రైలు బోగీలను తలపించేలా రంగులను వేయించారు.
Source: Eenadu
హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌లో మత్స్యకార్మికులు వినూత్నంగా చేపలను పడుతున్నారు. కల్వర్టు పైపుల వద్ద వలలు వేలాడదీస్తున్నారు. దిగువకు వెళ్లే నీటికి ఎదురీదే క్రమంలో పైకి ఎగిరి పైపుల వద్ద కట్టిన వలలో చేపలు చిక్కుతున్నాయి.
Source: Eenadu
అమెరికాలోని న్యూయార్క్‌లో ట్విన్ టవర్స్‌పై 21 ఏళ్ల క్రితం సెప్టెంబరు 11వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పౌరులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారంనివాళులర్పించారు. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో 3000 మంది పౌరులు మరణించారు.
Source: Eenadu
విశాఖపట్నంలో సముద్రపు కోత వల్ల ఏయూ యోగా సెంటర్ ఎదురుగా ఉన్న కొబ్బరిచెట్లు నేలకొరుగుతున్న నేపథ్యంలో సన్‌రే రిసార్ట్సు యంత్రాంగం రంగంలోకి దిగింది. భూమి లోపల ఇలా ఇనుపకంచెలో బండరాళ్లను ఉంచి (గాబ్రియన్‌వాల్) అడ్డుకట్ట వేస్తున్నారు.
Source: Eenadu
వీరు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని రైల్వే హైస్కూల్లో 1989 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివారు. చదువుకునే రోజుల్లో వేసుకున్న మాదిరి స్కూల్ యూనిఫాం ధరించి ఆదివారం ఇలా కలుసుకున్నారు.
Source: Eenadu
ఒడిశాలోని గంజాం జిల్లా ఛత్రపురం సమీపంలోని ‘తంపర’ సరస్సు పచ్చదనంతో ఆకట్టుకుంటోంది. ప్రభుత్వం ఇక్కడ సౌకర్యాలు అభివృద్ధిపరిచిందని, ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు రావాలని పర్యటకుల్ని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు.
Source: Eenadu