చిత్రం చెప్పే విశేషాలు..!

(14-09-2022/1)

చుట్టూ కొండలు.. మధ్యలో పచ్చని తివాచీలా పరుచుకున్న మొక్కలు.. ఓ పక్క నుంచి వంశధార నదీ ప్రవాహం.. మరో వైపు పాల నురగలా కనిపించే తెల్లగడ్డి పూలు.. మదిని మురిపించి కళ్లలో కాంతులు నింపే ఈ చిత్రం భామిని మండలంలోని దిమ్మిడిజోల సమీపంలోనిది.

Source: Eenadu

నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలు పూర్తిగా వాలిపోయి అప్పుడో.. ఇప్పుడో కూలేలా ఉండగా- పంటల సాగు సమయంలో ఏదైనా జరిగితే తీవ్ర ప్రమాదం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Source: Eenadu

ఆనందపురం మండలంలో కాలువలు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం ఉదయం 7సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. 126 అడుగుల నిల్వ సామర్థ్యమున్న గంభీరం జలాశయం పూర్తిగా నిండింది.

Source: Eenadu

ఇటీవల కురిసిన వర్షాలకు సీతారామరాజు జిల్లా అప్పలరాజుపేట శివారు వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది. జలాశయం నిండు కుండను తలపిస్తోంది. జడ్డంగి మడేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Source: Eenadu

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు పెట్టుకోవాలని నిబంధన విధించారు. కానీ, హనుమకొండ చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై పోలీసే ఇలా బండిపై వెళుతున్నారు. మరి పోలీసులు ఈ వాహనానికి జరిమానా విధించారో లేదో చూడాలి.

Source: Eenadu

వికారాబాద్‌ జిల్లా సరిహద్దు అంగడిచిట్టంపల్లి నుంచి కంకల్‌ వైపు ప్రధాన రహదారి గుంతలుగా మారి వాహనదారులకు, పాదచారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

Source: Eenadu

ఈ చిత్రాన్ని చూస్తుంటే ఏదో నది పరీవాహక ప్రాంతంలో ఇసుక మేటలా కనిపిస్తోంది కదూ. అలీసాగర్‌ జలాశయం గేట్లు ఎత్తడంతో కాలువల ద్వారా భారీగా వరద ప్రవహించింది. దాని ఉద్ధృతికి ఆ పక్కనే ఉన్న పంట పొలాల్లో ఇలా ఇసుక మేటలు వేశాయి.

Source: Eenadu

వీళ్లంతా చెట్టు కింద చదువుతున్నారేంటి అనుకుంటున్నారా? ఇక్కడ చదువుకునేందుకు విద్యార్థులు ఉన్నారు కానీ బడి లేదు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం మామిడిగూడ పంచాయతీ పరిధిలోని పెద్ద సల్పలగూడలో పాఠశాల భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో చెట్టు కిందే చదువుకుంటున్నారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home