చిత్రం చెప్పే విశేషాలు..! (14-09-2022/2)

ప్రధాని నరేంద్ర మోదీతో భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు భారత్‌-భూటాన్‌ సహకార, సంబంధాలపై చర్చించారు.

Image:Eenadu

రష్యా ఆక్రమించిన ఇజుం నగరాన్ని ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాల్గొన్నారు. సైనికులతో ఫొటోలు దిగి వారి పోరాట పటిమను అభినందించారు.

Image:Eenadu

క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య తన కుమారుడు అగస్త్య పాండ్యతో అక్షరాలు దిద్దిస్తున్న ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇలాంటి క్షణాలను ఆస్వాదించడానికే జీవితం ఉందని తెలుపుతూ హార్దిక్‌ పోస్టు పెట్టారు.

Image:Eenadu

రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. దుగ్గిరాల పట్టణంలో స్థానికులు పూలు చల్లి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు.

Image:Eenadu

మంత్రి, సినీనటి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు జబర్దస్త్‌ ఫేమ్‌ రాకేశ్‌, సుజాత తదితరులు ఆలయానికి వచ్చారు.

Image:Eenadu

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఇన్‌స్టా స్టోరీస్‌ వేదికగా సూర్యకుమార్‌ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూర్యకుమార్‌ యాదవ్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ కోహ్లి పోస్టు పెట్టారు. కాగా సూర్యకుమార్‌ నేటితో 32వ వసంతంలోకి అడుగుపెట్టారు.

Image:Eenadu

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో హైదరాబాద్‌ విమోచన అమృత మహోత్సవాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ విమోచనం ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన పెయింటింగ్‌ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

Image:Eenadu

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చినాబ్‌ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణం చేపడుతోన్న విషయం తెలిసిందే. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తోన్న ఈ వంతెన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనగా గుర్తింపు సాధించనుంది.

Image:Eenadu 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home