చిత్రం చెప్పే విశేషాలు..! (15-09-2022/2)
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం స్టాలిన్... ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని’ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాలిన్ విద్యార్థులకు స్వయంగా వడ్డించడంతో పాటు వారితో కలిసి అల్పాహారం తిన్నారు.
Image:Eenadu
సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మహిళా కార్యకర్తలు పాల్గొని మువ్వన్నెల జెండాలతో ర్యాలీ తీశారు.
Image:Eenadu
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల జాతీయ రహదారి పక్కన ధ్వంసం చేశారు. మొత్తం 2.5లక్షల సీసాలను జేసీబీతో తొక్కించారు.
Image:Eenadu
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సాగర్‌బాబు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
Image:Eenadu
మన దేశంలోకి 74ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ ప్రవేశించబోతున్నాయి.1948లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. దీంతో నమీబియా నుంచి చీతాలను తీసుకొస్తున్నారు. వాటిని తరలిస్తున్న విమానాన్ని ఇలా ఆకట్టుకునేలా అలంకరించారు.
#Eenadu
తిరుమల శ్రీవారిని దగ్గుబాటి సురేశ్ కుటుంబం దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత సురేశ్ బాబు, రానా కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Image:Eenadu
శైలైష్ కొలను దర్శకత్వంలో అడవి శేషు హీరోగా తెరకెక్కిన చిత్రం హిట్2. ఈ సినిమాను డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విష్వక్‌సేన్ నటించిన ‘హిట్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ హిట్ 2 వస్తోంది.
Image:Eenadu
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరుద్యోగ సమస్యపై నిరసన వ్యక్తం చేశారు.
Image:Eenadu