చిత్రం చెప్పే విశేషాలు..! (16-09-2022/2)
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 17న తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ వినూత్నంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. రజాకార్లు జనాలను ఉరేసి చంపి వేలాడదీయడం, బావిలో పడేయడం వంటి ఇతివృత్తాలతో సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు.
Image:Eenadu
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో నిర్వహించిన షాంఘై సహకార సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, వివిధ దేశాల కీలక నేతలు వేదికను పంచుకున్నారు.
Image:Eenadu
సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో శనివారం తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎన్‌సీసీ విద్యార్థినులు జాతీయజెండాలు చేతబూని కవాతు చేస్తూ కనిపించారు.
Image:Eenadu
మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో సినీనటి కీర్తి సురేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కీర్తిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలిరాగా.. ఆమె వారితో సెల్ఫీలు దిగి సందడి చేశారు.
Image:Eenadu
తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు 17 అడుగుల బతుకమ్మను తొరూర్ నుంచి ట్రాక్టర్‌లో తీసుకొచ్చారు.
Image:Eenadu
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.1.5కోట్ల విరాళం చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం తిరుమల గోశాలను సందర్శించారు.
Image:Eenadu
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలో భాగంగా హైదరాబాద్‌లోని మీర్ ఆలంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భారీ క్రేన్లపై జాతీయ జెండాలను ఎగురవేసి సమైక్య స్ఫూర్తిని చాటారు.
Image:Eenadu
దివంగత సినీ నటుడు, భాజపా నాయకుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.
Image:Eenadu