చిత్రం చెప్పే విశేషాలు..!(17-09-2022/2)
జర్మనీలోని మునిచ్‌లో బీర్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత బీర్ మగ్గుల కోసం యువత బారులుతీరారు. నాకంటే నాకంటూ చేతులు చాపుతూ కనిపించారు.
#Eenadu
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా కోఠి అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, వి.హనుమంతరావు తదితరులు నివాళి అర్పించారు.
#Eenadu
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ చుగ్, విజయశాంతి తదితరులు.
#Eenadu
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను ప్రత్యేక క్వారెంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అనంతరం మోదీయే స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫొటోలు తీశారు.
#Eenadu
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో 1213 మట్టి టీ కప్పులు, ఇసుకతో ఆయన శిల్పాన్ని తీర్చిదిద్ది బర్త్‌డే విషెస్ తెలిపారు.
#Eenadu
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.
#Eenadu
కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లి నమూనా విగ్రహాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గాంధీ భవన్‌లో ఆవిష్కరించారు.
#Eenadu
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పలువురు ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ మాస్కులతో హాజరై ఆకట్టుకున్నారు. నిజాం నుంచి తెలంగాణ విమోచనకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
#Eenadu